
వాస్తు శాస్త్రంం అనేవి కుటుంబంపై చాలా ప్రభావం చూపుతుంది. ఇళ్లు సరైన దిశలో లేకపోయినా, ఇంటిలోపల వాస్తు నియమాలు పాటించకపోయినా, చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మీరు వాస్తు సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో గనుక బాధపడుతున్నట్లు అయితే తప్పకుండా ఈ మొక్కలను మీ ఇంటిలోపల నాటండి.

బంతిపువ్వు మొక్క : బంతి పువ్వులు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అంతే కాకుండా వీటిని ఇంటిలో నాటడం వలన ఇంటికి అందమే కాకుండా వాస్తు కూడా కలిసి వస్తుందంట. ఈ మొక్కలు ఎవరైతే వారి ప్రధాన ద్వారం వద్దనాటుతారో, ఆ ఇంట అప్పుల బాధలే ఉండవు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

మనీ ప్లాంట్ : మనీ ప్లాంట్ అనేది సంపదకు చిహ్నం. ఈ మొక్క ఎవరి ఇంటిలో అయితే ఉంటుందో వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. అయితే వాస్తు ప్రభావంతో ఎవరైనా అప్పుల సమస్యలతో బాధపడుతున్నట్లు అయితే వారు ఇంటిలో మనీ ప్లాంట్ మొక్క పెంచుకోవడం మంచిదంట.

వెదురు : లక్కీ వెదురు ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే ఇది ఇంటిలో ఉంటే లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతుంటారు. అందువలన ఎవరైనా సరే తమ ఇంటిలో లక్కీ వెదురు నాటుకోవడం వలన అప్పుల సమస్యలు తొలిగిపోయి, ఇంటిలోపల సంపద పెరుగుతుందంట.

(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)