
వాస్తు శాస్త్రంలో పావురాలను శాంతి, ప్రేమ , ఐక్యతకు చిహ్నంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో పావురాలకు ఆహారం ఇవ్వడం వల్ల అన్ని రకాల గ్రహ దోషాలు, ప్రతికూల శక్తి తొలగిపోతాయి. ప్రజలు తరచుగా తమ ఇళ్ల పైకప్పు, బాల్కనీ, తోట లేదా ఉద్యానవనాలపై పావురాలకు, పక్షులకు ఆహారం పెడతారు. చాలా మంది కూడలి వద్ద కూడా పావురాలకు ఆహారం పెడతారు. మత విశ్వాసాల ప్రకారం పావురాలకు ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపద వస్తాయి. అయితే ప్రజలు పావురాలకు ఎందుకు ఆహారం పెడతారు? దాని వెనుక ఉన్న మత విశ్వాసం? పావురాలకు ఆహారం పెడితే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం, పావురాలకు ఆహారం పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. నమ్మకాల ప్రకారం పావురాలకు ఆహారం పెట్టడం వలన ఇంట్లోని ప్రతికూలత తొలగిపోయి, సానుకూల విషయాలు వస్తాయి. అందుకే చాలా మంది రోజూ పావురాలకు ఆహారం పెడతారు.

వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యోదయం సమయంలో తెల్లవారుజామున చిరు ధాన్యం పావురాలకు అందించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటాయి.

జ్యోతిష్యం ప్రకారం శనివారం ఈ పరిహారం చేయడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. జీవితంలో ఆనందం కలుగుతుంది. పావురాలకు మినప్పప్పు లేదా నల్ల నువ్వులు తినిపించాలి. ఇలా చేయడం ద్వారా శని దోషం తొలగిపోతుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పావురం వాయు మూలకంతో సంబంధం ఉన్న జీవి. పావురాలకు ఆహారం ఇవ్వడం వల్ల రాహువు, కేతువు, శని గ్రహాల పరిస్థితి మెరుగుపడుతుంది.

రాహు-కేతు లేదా కాల సర్ప దోషంతో బాధపడేవారు క్రమం తప్పకుండా పావురాలకు ఆహారం పెట్టాలి. ఇలా చేయడం ద్వారా మానసిక ఒత్తిడి మరియు గందరగోళం నుండి ఉపశమనం లభిస్తుంది

మత విశ్వాసం ప్రకారం పావురాలను శాంతికి చిహ్నంగా భావిస్తారు. కనుక పావురాలకు ధాన్యాన్ని ఆహారంగా పెట్టడం వలన ఇంట్లో ఆనందం, శాంతి కొనసాగుతుంది. అంతేకాదు ఈ పరిష్కారాన్ని అవలంబించడం ద్వారా వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని , జీవితంలోని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు.

మత విశ్వాసాల ప్రకారం, పక్షులకు ఆహారం పెట్టడం ద్వారా, మన పూర్వీకులు కూడా సంతృప్తి చెందుతారు. ఇలా చేయడం ద్వారా, పితృ దోషాన్ని వదిలించుకోవడంతో పాటు, పూర్వీకులు కూడా ప్రశాంతంగా ఉంటారు.

పక్షులకు ఆహారం, నీరు అందించడం పుణ్యకార్యం అని శాస్త్రాలలో చెప్పబడింది. ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. పక్షులకు క్రమం తప్పకుండా ఆహారం పెట్టే వారి ఇంట్లో డబ్బుకు కొరత ఉండదని నమ్మకం.