కరోనా తీవ్రత తగ్గిన నేపథ్యంలో ఏడుకొండలపై కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనభాగ్యాన్ని అందరికి కలిగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శన టికెట్లను ఈ రోజు నుంచి ప్రారంభించింది. భక్తులకు కరోనావైరస్ సోకకుండా నిబంధనలు పాటిస్తూ శ్రీవారి భక్తులకు ఉచిత దర్శనభాగ్యాన్ని కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 7.30 వరకూ భక్తులకు శ్రీవారిని దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది. ఇక ఆదివారం (సెప్టెంబర్ 19) నుంచి రాత్రి 11 గంటల వరకు పొడిగించారు. భక్తులను రాత్రి 11-11.30 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగింది. రోజుకు 25,000 మంది భక్తులు దర్శనం చేసుకోనున్నారు.
శనివారం 29,621 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత శనివారం అత్యధికంగా స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ఇక 15,039 మంది తల నీలాలను సమర్పించారు. హుండీ ఆదాయం 2.30 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
ఇలా శనివారం స్వామివారి భక్తుల సంఖ్య పెరగడానికి టైమ్ స్లాట్డ్ సర్వ దర్శన్ టోకెన్లను విడుదల చేయడమేనని తెలుస్తోంది. సాధారణ కోటాలో 2,000 టోకెన్లు, ఉచిత దర్శనం టికెట్లను రిలీజ్ చేసింది. దీంతో హిందూ అత్యంత పవిత్రంగా భావించే శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తమిళనాడు ,చిత్తూరు జిల్లా నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. ప్రతిరోజూ 8,000 మందిని స్వామివారి దర్శనానికి , ఉచిత దర్శనం కోసం 2,000 టోకెన్లు టిటిడి జారీ చేస్తుంది.
బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ విరాళం, అర్జిత సేవలు , ప్రత్యేక ప్రవేశ దర్శనంతో సహా వివిధ కేటగిరీల కింద దాదాపు 25,000 దర్శన టిక్కెట్‌లను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది, ఇక చిత్తూరు జిల్లా ప్రజలకు టీటీడీ అధికారులు 2,000 ఉచిత దర్శన టోకెన్లను జారీ చేస్తున్నారు.
తిరుమలలో సర్వ దర్శన టిక్కెట్ల జారీ ప్రక్రియ ఈరోజు ఉదయం 6 గంటల నుండి ప్రారంభమైంది. సర్వ దర్శన టోకెన్‌ల కోసం భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చి శ్రీనివాస కాంప్లెక్స్ వద్ద ఫుట్‌పాత్‌పై క్యూలో నిలబడ్డారు. సర్వ దర్శన టిక్కెట్ల సంఖ్యను పెంచాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వేలాది మంది భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. టీటీడీ రోజుకు 8,000 సర్వ దర్శన టోకెన్లను జారీ చేయనుంది.