Ancient Shiva Temples: శ్రావణ మాసంలో మహారాష్ట్ర వెళ్తున్నారా..! ఈ పురాతన, ప్రసిద్ధి చెందిన శివాలయలను సందర్శించండి..

|

Jul 20, 2024 | 9:01 AM

మనదేశంలో ఒకొక్క ప్రాంతం ఒకొక్క సంస్కృతి, సంప్రదాయం, ఆహారానికి ప్రసిద్ధి చెందింది. అదే విధంగా మహారాష్ట్రం కూడా విభిన్న సంస్కృతి, ఆహారానికి మాత్రమే ప్రసిద్ధి చెందిన ప్రదేశం. అంతేకాదు ఆధ్యాత్మికంగా గొప్ప గమ్యస్థానంగా ఉంది. ప్రత్యేకించి శ్రావణ మాసంలో శైవ క్షేత్రాలను దర్శనం చేసుకోవాలనుకుంటే మహారాష్ట్ర గొప్ప ప్రదేశం. ఇక్కడ అనేక పవిత్రమైన, పురాతన శివాలయాలు ఉన్నాయి. వీటిని శ్రావణ మాసంలో సందర్శించడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.

1 / 7
శ్రావణ మాసం వస్తే చాలు ఆధ్యాత్మిక వాతవరణం నెలకొంటుంది. ముఖ్యంగా ఉత్తరాదివారు శివయ్యను ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో చాలా కోలాహలం కనిపిస్తుంది. శివయ్యను స్తుతించే భక్తులు ఎక్కడ చూసినా కనిపిస్తారు. ఈ రాష్ట్రంలో జ్యోతిర్లింగ క్షేత్రాలు మాత్రమే కాదు అనేక ప్రసిద్ధి చెందిన శివాలయాలు ఉన్నాయి.  ఈ ఆలయాలను సందర్శించడం వలన ఆధ్యాత్మిక శాంతిని పొందడమే కాదు ఈ ఆలయాల నిర్మాణ శైలి , ప్రకృతి కూడా ఆకట్టుకుంటుంది. 

2 / 7
త్రయంబకేశ్వర దేవాలయం: శివ భక్తులు జ్యోతిర్లింగ దర్శనం లభించడం అదృష్టంగా భావిస్తారు.  12 జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. శ్రావణ మాసంలో ఈ జ్యోతిర్లింగ దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు. ముఖ్యంగా కాల సర్ప దోష నివారణ కోసం భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటారు.   

3 / 7
భీమ శంకర జ్యోతిర్లింగం:  ద్వాదశ జ్యోతిలింగ క్షేత్రాల్లో ఆరవ జ్యోతిర్లింగ క్షేత్రం భీమ శంకర క్షేత్రం. ఇది కూడా మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉంది. ఈ ఆలయం సహ్యాద్రి పర్వతాలలో ఉంది. ఇక్కడ శివయ్యను  మోటేశ్వర మహాదేవ అని కూడా పిలుస్తారు. ఈ జ్యోతిర్లింగానికి సమీపంలోనే భీమా నది కూడా ప్రవహిస్తుంది. శ్రావణ మాసంలో ఈ ఆలయ దర్శనం ముక్తి మార్గం అని నమ్మకం

4 / 7

ఔంధ నాగనాథ్ ఆలయం: మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఉన్న ఔంధ నాగనాథ్ ఆలయం చాలా గుర్తింపు పొందింది. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనది. ఈ ఆలయం సుమారు 7200 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ఆలయంలోని అందమైన శిల్పాలు, శిల్ప కళాసంపద చూపరులను ఆకట్టుకుంటుంది.   

5 / 7
అంబర్‌నాథ్ ఆలయం: మహారాష్ట్రలో శివునికి అంకితం చేయబడిన అంబర్‌నాథ్ ఆలయం ఉంది. దీనిని అంబరేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ నిర్మాణం పాండవుల కాలం నాటిదని నమ్ముతారు. మహారాష్ట్రకు వెళితే, ఈ ఆలయాన్ని సందర్శించడం ఎవరికైనా మంచి అనుభూతిని కలిగిస్తుంది.

6 / 7
మహాబలేశ్వర దేవాలయం: మహారాష్ట్రలోని సతారా జిల్లాలో పశ్చిమ కనుమల మీద చాలా అందమైన ప్రదేశం ఉంది. దీనిని మహాబలేశ్వర్ అని పిలుస్తారు. ఇది మహారాష్ట్రలో పర్యాటకులకు అత్యంత ప్రసిద్ధ చెందిన గమ్యస్థానం. దీనికి కారణం ఇక్కడ పచ్చని అడవులు, అందమైన పర్వతాలు, లోయలు, జలపాతాలు. అంతేకాదు పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించేది మహాబలేశ్వర్ శివాలయం.

7 / 7
ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ఆలయం: ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆఖరుది ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. ఈ స్వామి దర్శనం చేసుకుంటే కానీ జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదని నమ్మకం. ఈ ఆలయ ప్రస్తావన  శివ పురాణంలో కూడా ఉంది. ఘర్నేశ్వర అంటే కరుణ కలిగిన ప్రభువు అని అర్ధం. ఈ క్షేత్రం ఎల్లోరా గుహల నుండి సుమారు రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఎల్లోరాలో (వేరుల్ అని కూడా పిలుస్తారు) వద్ద ఉంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. 