Tirupati: శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం.. మధ్యాహ్నం 12 గం. ల తర్వాతే స్వామివారి దర్శనానికి అనుమతి..

| Edited By: Surya Kala

Sep 12, 2023 | 10:41 AM

తిరుమల ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు.. శ్రీవారి ఆలయంలో ఉన్న ఉన్న గర్భాలయ, ఉప దేవాలయాల పై కప్పులతో పాటు ఆలయ ప్రాంగణం, గోడలతో సహా పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం అర్చకులు సంప్రదాయంగా శుద్ధి చేస్తారు. ఈ ఆలయ శుద్ధి సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచుతారు. నీటితో శుద్ధి చేసిన అనంతరం ఆలయ పైకప్పులు, గోడలపై పరిమళం అనే ప్రత్యేక సుగంధ మిశ్రమాన్ని పూస్తారు.

1 / 7
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. స్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఏటా నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

2 / 7
. ఏడాదిలో ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈనెల 18 నుంచి జరగనుండటంతో ఈ రోజు ఉదయం 6 నుండి 11 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించనున్నారు.

3 / 7
 వాస్తవానికి బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఆలయ శుద్ధిలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తో పాటు ఈవో ధర్మారెడ్డి ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

4 / 7
తిరుమల ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు.. శ్రీవారి ఆలయంలో ఉన్న ఉన్న గర్భాలయ, ఉప దేవాలయాల పై కప్పులతో పాటు ఆలయ ప్రాంగణం, గోడలతో సహా పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం అర్చకులు సంప్రదాయంగా శుద్ధి చేస్తారు.

5 / 7
ఈ ఆలయ శుద్ధి సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచుతారు. నీటితో శుద్ధి చేసిన అనంతరం ఆలయ పైకప్పులు, గోడలపై పరిమళం అనే ప్రత్యేక సుగంధ మిశ్రమాన్ని పూస్తారు. ఈ సుగంధ మిశ్రమం... నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలను కలగలిపి తయారు చేస్తారు.

6 / 7
దీనిని ఆలయ సుద్ధి అనంతరం  సుగంధాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలంతో దేవాలయం అంతా ప్రోక్షణం చేశారు. ఈ సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన మిశ్రమం క్రిమి సంహారకంగా పని చేస్తుందని భక్తుల విశ్వాసం.

7 / 7
ఆలయ శుద్ధి అనంతరం శ్రీవారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవం అనంతరం మధ్యాహ్నం 12 గంటల తరువాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.