
వృషభం: ఈ రాశికి ధన స్థానంలో గురు చంద్రుల కలయిక, అంటే గజకేసరి యోగం ఏర్పడింది. రాశ్యధిపతి శుక్రుడు కూడా ధనస్థానంలోనే ఉండడం వల్ల ఈ రాశివారికి ఆ రెండు రోజుల నుంచి ఆదాయం దిన దినాభివృద్ధి చెందే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో రావలసిన సొమ్ము, రాదనుకున్న సొమ్ము, బాకీలు, బకాయిలన్నీ వసూలవుతాయి. ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది.

మిథునం: ఈ రాశిలో గురు, చంద్రుల కలయిక జరగడంతో పాటు, రాశ్యధిపతి బుధుడితో ధనాధిపతి చంద్రు డికి పరివర్తన కూడా జరిగినందువల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యో గంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను దాటుతాయి. ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆర్థిక సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారమవుతాయి.

సింహం: ఈ రాశికి లాభస్థానంలో గజకేసరి యోగం ఏర్పడడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆస్తి లాభం కలుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది.

కన్య: ఈ రాశికి దశమ స్థానంలో ఈ శుభ యోగం ఏర్పడడం ఒక అదృష్టం కాగా, అదే రాశిలో శుక్రుడు కూడా ఉండడం, పైగా రాశ్యధిపతి బుధుడు లాభాధిపతి చంద్రుడితో పరివర్తన చెందడం మరో విశేషం. ఈ పరిణామాల వల్ల వీరికి ఆదాయం బాగా పెరగడంతో పాటు శత్రు, రోగ, రుణ సమస్యల మీద విజయం సాధించడం కూడా జరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి.

తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో గజకేసరి యోగం కలగడంతో పాటు రాశ్యధిపతి శుక్రుడితో యుతి కూడా కలగడం వల్ల ఈ రాశివారు ఈ రెండు రోజుల్లో ఎటువంటి ప్రయత్నం చేసినా నూరు శాతం సక్సెస్ అవుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి, సంపద లభిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. రుణ సమస్యలు తీరిపోతాయి.

ధనుస్సు: రాశ్యధిపతి గురువుతో సప్తమ స్థానంలో చంద్రుడు కలవడం వల్ల ఈ రాశివారికి రాజపూజ్యాలు బాగా పెరుగుతాయి. ప్రభుత్వపరంగా గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ఊహించని పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. పోటీదార్ల మీద పైచేయి సాధి స్తారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్యాల నుంచి కోలుకునే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.

కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడడం వల్ల ఏలిన్నాటి శని దోషం చాలావరకు తగ్గిపోతుంది. ఆదాయం వృద్ధి చెంది, ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. ఆరోగ్య లాభం కలుగుతుంది.