
నేడు, అనగా నవంబర్ 5 బుధ వారం రోజున కార్తీక పౌర్ణమి. అత్యంత పవిత్రమైన రోజుల్లో ఇదొక్కటి. అయితే నేడు చాలా శుభయోగాలు ఏర్పడనున్నాయంట. దీని వలన మూడు రాశుల వారి తల రాత మారనున్నది అంటున్నారు పండితులు. ముఖ్యంగా, వీరు ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉన్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

వృషభ రాశి : వృషభ రాశి వారికి కార్తీక పౌర్ణమి అదృష్టం తీసుకొస్తుందనే చెప్పాలి. ఈ మాసంలో మూడు శుభయోగాలు ఏర్పడ నున్నాయి. దీంతో ఇది వీరికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ప్రయోజనం చేకూర్చ నున్నది. ఈ రాశి వారు ఈ మాసంలో మంచి కంపెనీలో ఉద్యోగం సాధిస్తారు. అంతే కాకుండా ఇంటిలోపల శుభకార్యం నిర్వహించే ఛాన్స్ ఉంది.

మిథున రాశి : మిథున రాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు స్థిరాస్తి లేదా ఇల్లు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అనుకోని విధంగా డబ్బు చేతికందుతుంది. ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో, వారి అప్పులన్నీ తీరిపోయి, చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

కన్యా రాశి : కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరికి పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. అనుకోని విధంగా డబ్బు చేతికందుతుంది. ఆర్థిక సమస్యలన్నీ తొలిగిపోతాయి. అప్పుల బాధలతో సతమతం అవుతున్నవారికి కూడా ఇది మంచి సమయం.

ఇక ఈ రాశి వారికి కార్తీక పౌర్ణమి ఏర్పడే శుభ యోగాలు ఈ రాశి వారికి ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది. ఈ రాశి ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.