
దాదాపు 18 ఏళ్ల తర్వాత కుజుడు, శుక్రుడు వృశ్చిక రాశిలో కలయిక జరపనున్నారు. చాలా రోజుల తర్వాత జరిగే ఈ కలయిక 12 రాశులపై దాని ప్రభావం చూపెట్టగా , నాలుగు రాశుల వారికి మాత్రం అనుకోని విధంగా ప్రయోజనాలు చేకూర్చనున్నదంట.

వృశ్చక రాశి : ఈ రాశి వారికి ఊహించని విధంగా అదృష్టం తలపు తట్టతుంది. పనులు వేగంగా పూర్తి అవుతాయి. ఉద్యోగప్రయత్నాలు లాభిస్తాయి. అనుకోని విధంగా డబ్బు చేతికందుతుంది. ఈ రాశి వారు ఎవరైతే చాలా రోజుల నుంచి తీర్థయాత్రలు ప్లాన్ చేస్తున్నారో, వారి కోరిక నెరవేరుతుంది.

కుంభ రాశి : ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. అనుకోని విధంగా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా దృఢంగా ఉంటారు.

మీన రాశి : మీన రాశి వారికి కుజ, శుక్ర గ్రహాల కలయిక వలన సంపద పెరుగుతుంది. విద్యార్థులకు అన్ని విధాల కలిసి వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే ఛాన్స్ ఉంది. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ అందుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది.

ధనస్సు రాశి : ధన స్సు రాశి వారికి ఊహించని ప్రయోజనాలు చేకూరనున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు.