
మకర సంక్రాంతి ఏకాదశితో కలిసి వస్తే శాస్త్రల ప్రకారం అస్సలే బియ్యం దానం చేయకూడదు అంటారు. ఈ రోజున బియ్యం దానం చేయడం వలన లక్ష్మీదేవి అలిగి వెళ్లిపోతుందని కూడా అంటారు. అయితే 2026లో వచ్చే సంక్రాంతి పండుగను కొన్ని నియమాలతో జరుపుకోవాలని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు.

ముఖ్యంగా ఈరోజున బియ్యం బియ్యం, కిచిడీ, బియ్యంతో చేసే ఏ ఆహారాన్ని అయినా సరే దానం చేయడం, తినడం చేయకూడదంట. మకర సంక్రాంతి ఏకాదశి తిథి రోజు వస్తే, ఆ మరసటి రోజు ద్వాదశి తిథి రోజున కిచిడీని దానం చేయడం చాలా మంచిదంట. ఇది రెండు పండగల ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు పండితులు.

ఇక మకర సంక్రాంతి ఏకాదశి తిథి లో వచ్చినప్పుడు, నలుపు, తెలుపు నువ్వులు, బెల్లంతో తయారు చేసిన లడ్డు తినడం దానం చెయ్యడం చాలా మంచిదంట. అంతే కాకుండా దీనిని సూర్య భగవానుడికి నైవేద్యంగా సమర్పించడం వలన ఇంటిలో సంపద పెరిగి, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు ఉంటాయంట.

అదే విధంగా మకర సంక్రాంతి రోజున నల్ల పప్పు, బియ్యం దానం చేయడం చాలా మంచిది. అంతేకాకుండా పేదలకు చలికాలం కాబట్టి వెచ్చని బట్టలు, దుప్పట్లు దానం చేయడం వలన లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. అలాగే నెయ్యి, పప్పులు, పసపు దానం చేయడం వలన కూడా అనేక ప్రయోజనాలు చేకూరుతాయంట.

అంతే కాకుండా, ఈ రోజున బ్రహ్మముహుర్తంలో నిద్రలేచి, సూర్యభగవానుడకి, రాగి , ఇత్తడి, వెండి లేదా బంగారు పాత్రలను ఉపయోగించి అర్ఘ్యం సమర్పించడం వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయంట. ఇంటిలో సిరుల పంట కురుస్తుందంట.