
అయితే భారత దేశంలో ఉన్న కొన్ని రకాల ఫేమస్ హనుమంతుడి ఆలయాలు, భక్తుల జీవిత సమస్యలను తొలిగిస్తాయంట. ఈ దేవాలయాలు, వాటి చారిత్రక ప్రాముఖ్యత, వాటికి సంబధించిన కథల ఆధారంగా తెలియజేయడం జరుగుతుంది. కాగా, ఇప్పుడు మనం వాటి గురించే వివరంగా తెలుసుకుందాం.

మహావీర్ మందిర్ , పాట్నా : పాట్రాలో ఉన్న మహావీర్ హనుమాన్ ఆలయం ప్రసిద్ధ ఆలయాల్లో ఒక్కటి. ఇక్కడికి నిత్యం వేలాది మంది భక్తులు వచ్చి స్వామి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. ముఖ్యంగా ఈ ఆలయంలోకి వెళ్లి, స్వామి వారికి స్వీ్ట్స్, నూనె దీపాలు సమర్పించడం వలన కుటుంబంలోని సమస్యలన్నీ తొలిగిపోయి, కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుందంట. అందుకే కుటుంబ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ఈ ఆలయానికి వెళ్తుంటారు.

మెహందీపూర్ బాలాజీ ఆలయం : రాజస్థాన్‌లో ఉన్న ఈ టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడికి వెళ్లి స్వామి వారిని దర్శించుకోవడం వలన ప్రతికూల శక్తుల నుంచి త్వరగా బయటపడతారంట.అలాగే నిద్రలేమి, భయం , దురదృష్టం వంటి సమస్యలు దూరం అవుతాయంట. అందుకే చాలా మంది ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ : భారతదేశంలోని ఫేమస్ హనుమాన్ టెంపుల్స్‌లో కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం ఒకటి. ఈ ఆలయాన్ని సందర్శించి, స్వామి వారికి పువ్వులు సమర్పించి, నూనె దీపాలు వెలిగిచడం వలన ఆఫీసులోని సమస్యలు తొలిగిపోవడమే కాకుండా, కెరీర్‌కు సంబంధించిన అడ్డంకులు కూడా తొలిగిపోతాయంట.

సంకట్ మోచన్, వారణాసి : వారణాసిలో ఉన్న సంకట్ మోచన్ ఆలయం చాలా ప్రసిద్ధ చెందినది. ఈ ఆలయాన్ని సందర్శిస్తే జీవితంలో ఉన్న అడ్డంకులు అన్నీ తొలిగిపోయి, చాలా ఆనదంగా ఉంటారంట. అలాగే ఇకకడ హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి.