
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాఖీ పౌర్ణమి రోజున శని గ్రహంతో పాటు బుధ, రాహువు, కేతవు గ్రహాలు తిరోగమనం చేయనున్నాయంట. దీని వలన కొన్ని రాశుల వారికి అనుకోని విధంగా అదృష్టం తలపు తట్టనున్నదంట. కాగా, ఇప్పుడు మనం ఆ రాశులు ఏవో చూసెద్దాం.

మేష రాశి : మేష రాశి వారికి గ్రహాల తిరోగమనం వలన రాఖీ పౌర్ణమి రోజు అద్భుతంగా ఉంటుంది. అనుకోనివిధంగా లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికపరమైన సమస్యలు తొలిగిపోతాయి.

వృశ్చిక రాశి : 4 గ్రహాల తిరోగమనం వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టిన పెట్టుబడులు చాలా లాభాలను తీసుకొస్తాయి. ఏ పని చేసినా అందులో విజయం మీ సొంతం అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆనందంగా జీవిస్తారు.

మీన రాశి : గ్రహాల తిరోగమనం సమయంలో ఈ రాశి వారు అధికంగా లాభాలు పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి . వ్యాపారంలో అనుకోని విధంగా ఆదాయం వస్తుంది. కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి రాఖీ పండగ అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి అవుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎవరైతే చాలా రోజుల నుంచి వివాహం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి త్వరలోనే పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉన్నదంట.