
మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో ఉద్యోగ స్థానాధిపతి శని సంచారం వల్ల అతి త్వరలో ఈ రాశివారికి విదేశీయాన యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా తప్పకుండా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. వీరు విదేశీ సంపాదనను అనుభవించడం జరుగుతుంది. వీసా సమస్యలు పరిష్కారం కావడంతో పాటు, విదేశాల్లో స్థిరత్వం కూడా లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది.

కర్కాటకం: ఈ రాశికి వ్యయ స్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంది. భారీ జీతభత్యాలు, మంచి పదవితో కూడిన విదేశీ అవకాశాలు అందే సూచనలున్నాయి. ఉన్నత విద్య కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్లడం కూడా జరుగుతుంది. విదేశీ ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా కూడా తరచూ విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. విదేశాల్లో ఉన్నవారికి స్థిరత్వం లభిస్తుంది.

కన్య: ఈ రాశికి వ్యయ స్థానంలో శుక్ర, కేతువుల సంచారం వల్ల అతి త్వరలో ఈ రాశివారు విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా ఈ రాశివారికి విదేశాల నుంచి అనేక ఆఫర్లు అందే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో విదేశీయానానికి మార్గం సుగమం కావడంతో పాటు, మంచి అవకాశాలు, ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న వారికి రాబడి పెరగడంతో పాటు స్థిరత్వం కలుగుతుంది. ఉన్నత విద్య కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.

తుల: ఈ రాశికి వ్యయ స్థానంలో రవి సంచారం వల్ల ఊహించని విధంగా విదేశాల్లో ఉద్యోగం చేసే అవ కాశం లభిస్తుంది. ప్రభుత్వపరంగా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడే అవకాశం ఉంది. వీసా సమస్యలు, స్థిరత్వం సమస్యలు కొద్ది ప్రయత్నంతో సానుకూలపడతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.

వృశ్చికం: ఈ రాశికి వ్యయ స్థానంలో రాశ్యధిపతి కుజుడి సంచారం వల్ల తప్పకుండా విదేశాలకు వెళ్లి స్థిరపడే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు తప్పకుండా అందుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. వీసా సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఎక్కువగా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. విదేశీ సంపాదన అనుభ వించే యోగం ఉంది. విదేశీ పర్యటనలు పెరుగుతాయి. విదేశాల్లో ఉన్న ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది.

మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో విదేశాలకు కారకుడైన రాహువు సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారికి అతి త్వరలో విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా అనేక దేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. నిరుద్యోగులే కాక, ఉద్యోగులు కూడా విదేశాల్లో ఉద్యోగాలు సంపా దించే అవకాశం ఉంది. ఉన్నత విద్యలకు విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంది. విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వం కలుగుతుంది.