
సూర్యగ్రహణం ఈ రోజు రాత్రి (సెప్టెంబర్ 21న) ప్రారంభమై.. సెప్టెంబర్ 22వ తేదీ తెల్లవారుజామున ముగుస్తుంది. ఆ సమయంలో సూర్యుడు కన్యారాశి, ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఉంటాడు. అంతేకాదు చంద్రుడు ,బుధుడు కూడా కన్యారాశిలో ఉంటారు. బుధుడు, సూర్యుడి కలయికను బుధాదిత్య యోగం అంటారు . ఈ యోగం గ్రహణం సమయంలో ఏర్పడితే దానికి ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు ఇతర గ్రహాల స్థానాలు కూడా ముఖ్యమైనవి. శనీశ్వరుడు మీన రాశిలో, బృహస్పతి మిథునంలో, కుజుడు తులారాశిలో, శుక్రుడు ,కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో ఉంటారు. ఈ గ్రహాల స్థానాలు సూర్యగ్రహణం ప్రభావాలపై భిన్నమైన ప్రభావాలను చూపుతాయి.

మేషరాశి: సూర్యగ్రహణం ఈ రాశికి వారి కెరీర్‌కు కొత్త విజయాన్ని తీసుకురావచ్చు. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. మనశ్శాంతిని అందిస్తుంది. పనిలో కొత్త అవకాశాలు లభిస్తాయి. భాద్యతలు మరింతగా పెరిగే అవకాశం ఉంది.

వృషభ రాశి: ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే గ్రహణం ప్రభావం వలన వీరు బలహీనతకు లేదా అలసటకు గురవుతారు. కుటుంబ వివాదాలను నివారించండి, ఎందుకంటే ఇది సంబంధాలను దెబ్బతీస్తుంది. ఆశించిన ఫలితాలను సాధించకపోవడంతో నిరాశకు గురవుతారు. ఓపికగా ఉండాలి. ఆర్థిక నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి.

మిథున రాశి: వీరు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సూర్యగ్రహణం మానసిక ఒత్తిడిని పెంచుతుంది. కుటుంబంలో లేదా సామాజిక జీవితంలో విభేదాలు తలెత్తవచ్చు కనుక జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆర్థిక విషయాలకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం, మంత్రాలు జపించడం ప్రయోజనకరంగా ఉంటుంది.

కర్కాటక రాశి: ఈ సమయం వీరు పని పరంగానే కాదు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పాత వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై కూడా ఆసక్తి చూపే అవకాశం ఉంది.

సింహ రాశి: ఈ సమయంలో వీరు ఎక్కువ అలసటతో లేదా అశాంతితో బాధపడవచ్చు. కుటుంబంలో కొన్ని విభేదాలు ఉండవచ్చు, వీటిని నివారించాలి. కృషికి తగిన పూర్తి ఫలితాలు కనిపించకపోవడం నిరాశకు కారణం కావచ్చు. ఆర్థిక విషయాలలో సంయమనం పాటించండి. తొందరపాటు చర్యలకు దూరంగా ఉండండి. సూర్యుడికి సంబంధించిన మంత్రాలను జపించడం ప్రయోజనకరంగా ఉంటుంది.

కన్య రాశి: సూర్య గ్రహణం ఈ రాశిలోనే ఏర్పడనుంది. ఈ గ్రహణం వీరికి విజయం , పురోగతిని తెస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో మార్పులు ప్రయోజనకరంగా నిరూపించబడవచ్చు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కొత్త ఆదాయ వనరులు ఉద్భవించవచ్చు. సంబంధాలలో విభేదాలు తగ్గుతాయి. సామరస్యం పెరుగుతుంది.

తుల రాశి: ఆరోగ్య సమస్యలు లేదా బలహీనతలు తలెత్తవచ్చు. కనుక జాగ్రత్త అవసరం. కుటుంబ జీవితంలో ఉద్రిక్తతలు పెరగవచ్చు కనుక ఓర్పు , అవగాహనతో వ్యవహరించాలి. డబ్బుకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. యోగా , ధ్యానం మానసిక ప్రశాంతంను చేకూరుస్తాయి.

వృశ్చిక రాశి: సూర్యగ్రహణం వీరి జీవనశైలిలో సానుకూల మార్పులను తెస్తుంది. చేపట్టిన పని విజయవంతం అవుతుంది. కొత్త బాధ్యతలను పొందవచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాత ఒత్తిళ్లు తొలగిపోతాయి. కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. సామాజిక వృత్తాన్ని విస్తరిస్తుంది.

ధనుస్సు రాశి: సూర్యగ్రహణం ధనుస్సు రాశి వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు. ఈ గ్రహణం వృత్తి, కెరీర్ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. కలిగించవచ్చు. ఇది ఒక పరీక్షా సమయం కావచ్చు, ఇది వారి సహనాన్ని, సంబంధాలను పరీక్షించగలదు. కనుక ప్రభావన్ని తగ్గించుకునేందుకు సూర్య మంత్రాలు జపించడం, ధ్యానం చేయడం మంచిదని చెబుతున్నారు.

మకర రాశి: సూర్యగ్రహణం ప్రభావం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలను, ముఖ్యంగా అలసట, మానసిక ఒత్తిడిని అనుభవించవచ్చు. చిన్న విషయాలకే కుటుంబంలో వివాదాలు తలెత్తవచ్చు. కనుక ఓర్పు, అవగాహనతో వ్యవహరించండి. ఆర్థిక లేదా వ్యాపార నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు హానికరం కావచ్చు. సూర్యుడి సంబంధించిన మంత్రాలు క్రమం తప్పకుండా జపించడం , ధ్యానం చేయడం వల్ల శాంతి ,సానుకూల శక్తి కాపాడుతుంది.

కుంభ రాశి: ఈ సమయంలో వీరి ఆరోగ్యం క్షీణించవచ్చు.. జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆశించిన ఫలితాలు లభించకపోతే నిరాశ చెందే అవకాశం ఉంది. ప్రధాన నిర్ణయాలను వాయిదా వేయండి. మనశాంతి కోసం సూర్య మంత్రాలను జపించండి.

మీన రాశి: గ్రహణ సమయం వీరికి కొత్త ఆశ, ఆనందాన్ని తెస్తుంది. ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి. కెరీర్‌లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. మానసిక సమతుల్యతను కాపాడుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. అపార్థాలు తొలగిపోతాయి.