
అన్నిగ్రహాల్లో శక్తివంతమైన గ్రహం సూర్య గ్రహం. ఈ గ్రహం అతి త్వరలో సంచారం చేయబోతుంది. సెప్టెంబర్ 17న సూర్య గ్రహం కన్యారాశిలోకి ప్రవేశించి, అక్టోబర్ 16 వరకు అందులోనే ఉండనున్నాడు. దీని వలన మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానున్నది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

మిథున రాశి :సూర్యుడి సంచారం వల్ల మిథున రాశివారికి చాలా బాగుంటుంది ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందుతారు. వ్యాపారస్తులు కూడా అద్భుతమైన ప్రయోజనాలు అందుకుంటారు. అలాగే వ్యాపారాలు కూడా చాలా వరకు లాభసాటిగా మారుతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగు పడుతాయి. వైవాహిక జీవితం అద్భుతంగా, ఆనందంగా ఉంటుందంట.

వృశ్చిక రాశి :సూర్యుడు కన్యారాశిలోకి సంచారం చేయడం వలన వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానున్నది. వీరికి పనుల్లో అడ్డంకులు తొలిగిపోతాయి. చాలా రోజుల నుంచి వాయిదా వేసుకుంటూ వస్తున్న పనులన్నింటిని పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారల్లో అనేక లాభాలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారం చాలా బాగా సాగుతుంది.

తుల రాశి : తుల రాశి వారికి సూర్య గ్రహ సంచారం వలన అనేక అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయని చెబుతున్నారు పండితులు. దీని వలన ఈ రాశి వారు ఆర్థికంగా స్థిరపడనున్నారంట. ఆదాయం పెరగడం వలన స్థిర ఆస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరుతారు. ఎవరైతే చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వారికి కలిసి వస్తుంది.

విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. ఏ పరీక్షల్లోనైనా విజయం మీదే అవుతుంది. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఇంట్లో ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతోషంగా జీవిస్తారు. సమస్యలన్నీ తొలిగిపోతాయి.