ఈ నెల 16 నుంచి నెల రోజులు పాటు రవి కేతువులు కన్యా రాశిలో కలిసి ఉండడం జరుగు తుంది. సాధారణంగా ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు, తాపత్రయాలు, ఆరాటాలు వృద్ధి చెందుతాయి. అనుకున్నది సాధించే వరకూ నిద్ర పట్టదు. ఈ రెండు గ్రహాల యుతి కన్యా రాశిలో జరుగుతున్నందువల్ల ప్రయత్నాలు, పట్టుదలలు మరీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సంపాదన మీద, ఆదాయాన్ని పెంచుకోవడం మీద, ఆస్తిపాస్తుల్ని కూడగట్టుకోవడం మీద శ్రద్ద బాగా పెరుగుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశివారిలో ఈ పట్టుదల, తాపత్రయం స్పష్టంగా కనిపిస్తాయి. ఈ రెండు గ్రహాలకు కన్యారాశి మిత్రక్షేత్రమే అయినందువల్ల ఈ రాశుల వారు అనుకున్నది సాధిస్తారు.