
మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపడుతున్నందువల్ల విలాసాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. సుఖ సంతోషాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. విహార యాత్రలు, వినోద యాత్రలకు కూడా ఎక్కువ అవకాశం ఉంది. అనవసర పరిచయాలు, వ్యసనాలు చోటు చేసుకుంటాయి. పరిచయాలను, స్నేహ సంబంధాలను, అవకాశాలను దుర్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. మొత్తం మీద కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అయ్యే అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల భోగభాగ్యాలు వృద్ధి చెందే అవకాశం ఉంది కానీ, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తప్పటడుగులు వేసే ప్రమాదం ఉంది. సాధారణంగా విదేశీ ప్రయత్నాలు, విదేశీ అవకాశాలు అందినట్టే అంది చేజారిపోవడం జరుగుతుంది. అక్రమ సంబంధా లకు, అనవసర పరిచయాలకు ప్రాధాన్యం ఇచ్చే సూచనలున్నాయి. తండ్రితో అకారణ విభేదాలు తలెత్తవచ్చు. ప్రయాణాల వల్ల లాభం కలగకపోవచ్చు. తొందరపాటుతో వ్యవహరించే అవకాశం ఉంది.

సింహం: అష్టమ స్థానంలో శుక్రుడి ఉచ్ఛ సంచారం వల్ల ఆకస్మిక ధన లాభానికి, ఆకస్మిక అధికార యోగా నికి బాగా అవకాశం ఉంది. అయితే, అనవసర పరిచయాలు, వ్యసనాలు కొద్దిగా వృద్ధి చెందే సూచ నలున్నాయి. బంధుమిత్రులతోనే కాకుండా జీవిత భాగస్వామితో సైతం అకారణ విభేదాలు తలె త్తడం జరుగుతుంది. వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు లోపిస్తాయి. వృథా ఖర్చులు బాగా పెరుగుతాయి. వృథా ప్రయాణాలతో ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో అపార్థాలు తప్పకపోవచ్చు.

తుల: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఆరవ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ఆకస్మిక ధన లాభం కలిగినా, అధికార యోగం పట్టినా అది తాత్కాలికమే అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బం దులు తలెత్తుతాయి. అనేక అవకాశాలు, ప్రయత్నాల వల్ల ఆదాయం పెరిగినప్పటికీ విలాసాల మీదా, మిత్రుల మీదా, కుటుంబం మీదా బాగా ఖర్చు పెట్టడం వల్ల ఆ తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి అనుకూలతలు తగ్గే ప్రమాదం కూడా ఉంది.

మీనం: ఈ రాశికి దుస్థానాధిపతి, పరమ పాపి అయిన శుక్రుడు ఈ రాశిలో సంచారం చేయడం వల్ల శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ప్రయాణాల్లో బాగా ఇబ్బందులు కలుగుతాయి. ఆశించిన ప్రయోజనాలు నెరవేరకపోవచ్చు. పెళ్లి ప్రయత్నాలు చాలావరకు తప్పిపోయే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది.