
గ్రహాల కదలికలో మార్పులు లేదా రాశులు, నక్షత్రరాశులలో మార్పులు అన్ని రాశులకు చెందిన వ్యక్తుల జీవితాలపై భిన్నమైన ప్రభావాన్ని చూపుతాయి. జ్యోతిషశాస్త్రంలో శుక్రుడిని దయగల గ్రహం అంటారు. అటువంటి శుక్రుడు అక్టోబర్ 28న నక్షత్రాన్ని మర్చుకోనున్నాడు. ఈ రోజున శుక్రుడు.. అంగారకుడు అధిపతి అయిన చిత్త నక్షత్రము(చిత్ర నక్షత్రం)లోకి ప్రవేశించనున్నాడు. దీంతో నాలుగు రాశులకు చెందిన వ్యక్తులు చాలా మంచి ఫలితాలను పొందుతారు. శుక్రుని శుభ ప్రభావం వల్ల కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. అందం చాలా పెరుగుతుంది. కనుక శుక్రుడు నక్షత్రంలో మార్పు వల్ల ఏ రాశులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.. అపారమైన ఆనందం, శ్రేయస్సు ఎవరికీ లభిస్తుందో తెలుసుకుందాం..

మేషరాశి: మేషరాశిలో జన్మించిన వారికి శుక్రుని సంచారము చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ శుక్రుని సంచారము అదనపు ప్రయోజనాలను తెస్తుంది . మేషరాశిలో జన్మించిన వ్యక్తులు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. ఈ కాలంలో శుక్రుని శుభ ప్రభావం కారణంగా భాగస్వామితో వీరి సంబంధంలో ప్రేమ పెరుగుతుంది. ఇంట్లో ఆనందం, శాంతి ఖచ్చితంగా ఉంటాయి. మేష రాశిలో జన్మించిన వ్యక్తులు కెరీర్‌లో పురోగతి లభిస్తుంది. వ్యాపారస్తులు లాభాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో సామరస్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమ పెరుగుతుంది. జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. శుక్ర గ్రహం ప్రభావం కారణంగా వీరు కళ, సంగీతం వైపు ఆకర్షితులవుతారు.

వృషభ రాశి: శుక్రుడు నక్షత్ర మార్పు తో ఈ రాశిలో జన్మించిన వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ కాలంలో వీరు ఉత్సాహంతో ఉంటారు . ఆనందం, శ్రేయస్సు వీరి సొంతం. ఈ వ్యక్తుల జీవితాల్లో విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దీనితో పాటు శుక్రుని శుభ ప్రభావం కారణంగా వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు జీవితంలో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు చిత్త నక్షత్రంలోకి ప్రవేశించడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కొత్త శక్తిని పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తగ్గుతాయి. ఆర్థిక, భౌతిక ఆనందం పెరుగుతుంది. ప్రేమ సంబంధాలలో స్థిరత్వం ఉంటుంది. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితంలో సామరస్యం పెరుగుతుంది.

తులా రాశి: ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు శుక్రుని నక్షత్ర మార్పు కారణంగా ఆత్మవిశ్వాసంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ఈ కాలంలో పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. అందువల్ల తుల రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ కాలంలో మంచి సంబంధాలు లభిస్తాయి. ప్రేమను పొందే అవకాశం పెరుగుతుంది.కెరీర్‌లో చాలా పురోగతి సాధిస్తారు. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను పొందుతారు. ఆనందంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. ఈ సమయంలో భూమిని కొనుగోలు చేయవచ్చు లేదా ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఏర్పడతాయి.

వృశ్చిక రాశి:శుక్రుడు చిత్త నక్షత్రంలోకి ప్రవేశించిన వెంటనే వీరు వేసే ప్రతి అడుగులోనూ అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ కాలంలో అసంపూర్ణమైన పనులన్నీ పూర్తవుతాయి. అదేవిధంగా ఈ కాలంలో వీరు కోల్పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం కలుగుతుంది. శుక్రుని శుభ ప్రభావం కారణంగా ఆర్ధిక పురోగతి సాధించే అవకాశం లభిస్తుంది.

మకర రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు శుక్రుడు నక్షత్ర సంచారం శుభప్రదం. ఈ సమయంలో సుదీర్ఘ ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఈ కాలంలో అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది. అసంపూర్ణమైన పనులు పూర్తవుతాయి. పెండింగ్‌లో ఉన్న డబ్బును పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి.