4 / 6
ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్ర, రాహువుల యుతి జరుగుతున్నందువల్ల కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కార మవుతాయి. ఆస్తి లాభం కలుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.