
మేషం: ఈ రాశివారికి అక్టోబర్ రెండవ వారం వరకూ శని, గురువులతో పాటు బుధ, శుక్రులు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక బలం బాగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ విజయం సాధిస్తాయి. రుణ విముక్తులవుతారు.

వృషభం: ఈ రాశికి గురువు ధన స్థానంలో, శని లాభ స్థానంలో, రాశ్యధిపతి శుక్రుడు, రవి, బుధులు అనుకూల స్థానాల్లో సంచారం అనేక విధాలుగా అదృష్టాలు కలుగుతాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉంది. మరో మూడు నెలల్లో ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభించే సూచనలున్నాయి. ఆస్తిపాస్తులు కలిసి రావడం, రావలసిన సొమ్ము చేతికి అందడం, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభించడం వంటివి జరుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది.

కర్కాటకం: ఈ రాశికి శని, శుక్ర, కుజ, రవుల అనుకూలత వల్ల కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో జీత భత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరగడం జరుగుతుంది. రుణ సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు, ఒప్పందాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి వస్తుంది.

తుల: ఈ రాశికి శని, గురువు, రాశ్యధిపతి శుక్రుడు, బుధుడు, రవి గ్రహాలు క్రమంగా అనుకూలంగా మారుతున్నందువల్ల అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. వడ్డీ వ్యాపారాలు, షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. రావలసిన సొమ్ము, బాకీలు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతాయి. లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో రాహువు, సప్తమంలో రాశ్యధిపతి గురువు, కుజ, బుధ, రవుల అనుకూల సంచారం వల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. బుధ, శుక్రుల అనుకూలత వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. మనసులోని కోరికలు చాలావరకు నెర వేరుతాయి. సొంత ఇల్లు అమరుతుంది. ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు. దాదాపు ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. దీర్ఘకాలిక రుణాలను కూడా చాలావరకు తీర్చేసే అవకాశం ఉంది.

మకరం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో ధనాధిపతి శనీశ్వరుడు, అనుకూల స్థానాల్లో కుజ, శుక్ర, బుధుల సంచారం వల్ల ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో విపరీత రాజయోగాలు కలుగుతాయి. జీతభత్యాలు అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. ఆదాయం క్రమంగా పెరగడం తప్ప తగ్గడం ఉండదు. ఒక ప్రణాళిక ప్రకారం ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించు కుంటారు. లాభదాయక పరిచయాల ద్వారా కూడా లబ్ది పొందడం జరుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది.