Pew Survey: అత్యధిక హిందువులు పూజించే దేవుడు ఎవరు ? .. అమెరికాకు చెందిన సంస్థ సర్వేలో ఆసక్తికర విషయాలు

| Edited By: Surya Kala

Jul 09, 2021 | 7:46 PM

Pew Survey: భారత దేశం ఆధ్యాత్మిక దేశం.. హిందువులు దేవుడున్నాడు అని నమ్ముతారు.. దెయ్యం అంటే భయపడతారు. మనం చేసే పనులు మన జీవితాన్ని నిర్దేశిస్తాయని భావిస్తారు.. ఇక హిందువుల దేవుళ్ళు పురాణాల ప్రకారం ముక్కోటి మంది. వారిలో కొద్దిమంది మాత్రమే పూజలందుకుంటారు. అయితే మనదేశంలో ఎక్కువగా నమ్మి కొలిచేదేవుడు ఎవరనే విషయం పై అమెరికాకు చెందిన ఓ సంస్థకు ఆసక్తి కలిగింది.

1 / 6
హిందువుల పురాణాల ప్రకారం ఎంతమంది దేవుళ్ళు ఉన్నా.. త్రిమూర్తులలతో పాటు జగన్మాతకు అగ్రస్థానం. ఇక విఘ్నాలకధిపతి గణేశుడు.. ఇలా అనేక మంది దేవుళ్ళున్నారు. కానీ భక్తులతో పూజలందునేది మాత్రం కొంతమంది దేవుళ్ళే.. అతికొద్ది మంది దేవుళ్ళకు మాత్రమే ఆలయాలున్నాయి.

2 / 6
 శివుడి తర్వాత ఎక్కువగా పూజలు అందుకుంటున్న వారిలో హనుమాన్, గణేశ్, లక్ష్మీదేవి, కృష్ణుడు, కాళీమాత, రాముడు ఉన్నారు. హిందువుల్లో మూడింట ఒకవంతు మంది అంటే 35 శాతం మంది హనుమంతుడుని , 32 శాతం మంది గణేశుడిని పూజిస్తున్నారు.  లక్ష్మిదేవి (28 శాతం), కృష్ణుడు(21 శాతం), కాళీమాత (20 శాతం) మంది పూజిస్తుందా రాముడిని 17శాతం మంది కొలుస్తున్నారు

3 / 6
భారత దేశంలో ఉన్న మతాలు విశ్వాసాలపై అమెరికాకు చెందిన పీవ్ రీసర్చ్ సెంటర్ ఓ సర్వే చేసింది. 15మంది దేవతలున్న ఫోటోను చూపించి ఏ దేవుడిని పూజిస్తారు అంటూ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ఎక్కువమంది భోళాశంకరుడు పరమ శివుడిని పూజిస్తున్నట్లు తెలిసింది.45 శాతం మంది హిందువులు సృష్టి లయకారుడైన శివుడిని ఆరాధిస్తున్నారు.

4 / 6
అయితే ఇక్కడ విశేషం ఏమింటే.. రాముడి కంటే ఆయన సేవకుడు హనుమంతుడికి ఎక్కువ సంఖ్యలో భక్తులు ఉన్నారు. హనుమంతుడికి 32 శాతం మంది భక్తులు ఉండగా... రాముడిని 17 శాతం మంది భక్తులు పూజిస్తున్నారు. 2019 నుంచి 2020 మధ్య కాలంలో ఈ సర్వే కొనసాగింది. తాజాగా సర్వే ఫలితాలను విడుదల చేశారు.

5 / 6
భారతదేశంలోని పశ్చిమ దేశాలలో హిందువులు గణేశుడిని పూజిస్తుండగా  ఈశాన్యంలో 15 శాతం మంది  మాత్రమే పూజిస్తున్నారు. ఇక  ఈశాన్యంలో 46 శాతం హిందువులు కృష్ణుడిని తమ ఇష్ట దైవంగా కొలుస్తుండగా.. దక్షిణాది భరత దేశంలో మాత్రం కేవలం 14 శాతం మంది  మాత్రమే శ్రీకృష్ణుడిని పూజిస్తున్నారు.

6 / 6
సర్వేలో  ఎక్కువమంది భారతీయులు ఇతర మతస్తులతో ఇబ్బంది లేదని తెలిపారు. అయితే పొరుగువారు తమ సొంత మతస్తులైతేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా వెలిబుచ్చారు. 77 శాతం మంది హిందువులు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. పునర్జన్మపై నమ్మకం ఉందని 27 శాతం మంది ముస్లింలు చెప్పారు. ముస్లింలు, సిక్కులు మరియు క్రైస్తవులలో ఎక్కువమంది తాము ఒకే దేవుడిని మాత్రమే నమ్ముతున్నామని చెప్పారు. ఎక్కువ మంది హిందువులు దేవుళ్ళు ఏ రూపంలో ఉన్నా ఏక స్వరూపుడు అని చెప్పారు.