
మేషం: ఈ రాశికి శని వ్యయ స్థానంలో సంచారం వల్ల ఏలిన్నాటి దోషం కలిగింది. దీనివల్ల ప్రతి పనీ ఆలస్యం కావడం, శ్రమ, తిప్పట ఎక్కువగా ఉండడం, కొద్దిగా వైద్య ఖర్చులు పెరగడం వంటివి జరిగే అవకాశం ఉంది. శనికి తరచూ ప్రదక్షిణలు చేసే పక్షంలో శని అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగాలు లభించడం, ఉద్యోగుల్లో శక్తి సామర్థ్యాలు పెరగడం, నైపుణ్యాలు వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి. డబ్బు దాచుకోవడం అలవాటవుతుంది.

సింహం: ఈ రాశికి అష్టమ శని దోషం ఏర్పడింది. దీనివల్ల ఆదాయం పెరగకపోవడం, ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారం కాకపోవడం, వ్యయ ప్రయాసలు ఎక్కువ కావడం, ఉద్యోగంలో గుర్తింపు లభించకపోవడం వంటివి జరుగుతాయి. శనికి ప్రదక్షిణలు చేయడం, శివార్చన చేయించడం, దీపం వెలిగించడం వంటి చిన్నపాటి పరిహారాల వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొద్దిపాటి శ్రమతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. ప్రయత్నాల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి బయటపడడానికి శనికి తరచూ తైలాభిషేకం చేయించడం మంచిది. దీనివల్ల ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.

ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో శని తిష్ఠ వేయడం వల్ల అర్ధాష్టమ శని దోషం ప్రారంభమైంది. దీనివల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. అపార్థాలు చోటు చేసుకుంటాయి. శుభ కార్యాలకు భంగం ఏర్పడుతుంది. ఆస్తి సమస్యలు ఇబ్బంది పెడతాయి. గృహ నిర్మాణానికి ఆటంకాలు పెరుగుతాయి. ఈ రాశివారు శనికి తరచూ ప్రదక్షిణలు చేయడంతో పాటు శివార్చన చేయించడం వల్ల ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆదాయానికి లోటుండదు.

కుంభం: ఈ రాశివారికి ఏలిన్నాటి శని దోషం జరుగుతోంది. దీనివల్ల ఆదాయంలో పెరుగుదల ఉండకపోవచ్చు. కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. శుభకార్యాలు వెనుకపట్టు పడతాయి. మాట తొందర ఎక్కువగా ఉంటుంది. రావలసిన సొమ్ము ఒకపట్టాన చేతికి అందదు. సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఈ దోషాలు తగ్గడానికి నలుపు రంగు కలిసిన దుస్తులు ఎక్కువగా ధరించడం మంచిది. ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

మీనం: ఈ రాశివారికి ఏలిన్నాటి దోషం కొనసాగుతోంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యం, ప్రాభవం బాగా తగ్గుతాయి. పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల ఆగిపోతాయి. మిత్రులు, సన్నిహితులు బాగా దూరమవుతారు. కుటుంబ జీవితం అస్తవ్యస్తమవుతుంది. అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడాలన్న పక్షంలో శివార్చన, శనికి పూజలు తప్పనిసరి. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఖర్చులు చాలావరకు తగ్గుతాయి.

Crime News

Hmda Ed