సాధారణంగా అందరూ భయపడే శనీశ్వరుడు ఇప్పటి నుంచి దాదాపు ఏడాదిన్నర పాటు ఎనిమిది రాశుల వారి మీద అద్భుతంగా, అద్వితీయంగా సంపదల వర్షం కురిపించబోతున్నాడు. ఇందులో నాలుగు రాశుల వారికి అత్యంత అరుదైన శశ మహా పురుష యోగం పట్టబోతుండగా, మూడు రాశుల వారికి ఊహించని ధన యోగం పట్టబోతోంది. ఈ ఏడు రాశులుః మేషం, వృషభం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. ఇందులో వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశుల వారు అపురూపమైన శశ మహా పురుష యోగాన్ని అనుభవించబోతున్నారు. మేషం, కన్య, ధనుస్సు, మకర రాశుల వారికి లక్ష్మీ కటాక్ష యోగం పట్టబోతోంది.