
మేషం: ఈ రాశికి దశమ స్థానంలో రాశ్యధిపతి కుజుడు ఉచ్ఛపట్టడంతో పాటు, శుక్ర, బుధ, రవులు కూడా సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి ఒక నెల రోజుల పాటు విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు అంచనాలకు మించి లాభించడంతో పాటు, రావలసిన డబ్బు పూర్తిగా చేతికి అందడం, మొండి బాకీలు కూడా వసూలు కావడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది.

వృషభం: రాశ్యధిపతి శుక్రుడితో పాటు కుజ, రవి, బుధులు భాగ్య స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారి మీద అక్షరాలా కనక వర్షం కురిసే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒకటికి రెండు సార్లు ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ధన ధాన్య సమృద్ధి యోగం పడుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరగడంతో పాటు విదేశీ సంపాదన యోగం కలిగే అవకాశం కూడా ఉంది. గృహ, వాహన యోగాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి.

కన్య: రాశ్యధిపతి బుధుడితో పాటు రవి, శుక్ర, కుజులు పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి కలలో కూడా ఊహించని రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతాన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది.

తుల: ఈ రాశికి చతుర్థ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడితో మూడు గ్రహాలు కలవడం వల్ల జీవితం నెల రోజుల పాటు నిత్య కల్యాణం పచ్చతోరణంలా సాగిపోతుంది. ఉద్యోగంలో హోదా, స్థితిగతులు పెరగడంతో పాటు సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించడం, కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. సంపద వృద్ధి చెందుతుంది.

ధనుస్సు: ఈ రాశికి ధన స్థానంలో నాలుగు గ్రహాల సంచారం వల్ల ఈ రాశివారికి అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. జీతభత్యాలు, రాబడి, లాభాలు పెరగడంతో పాటు అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ చాలావరకు సత్ఫలితాలనిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదే వీలు, వడ్డీ వ్యాపారాలు బాగా లాభిస్తాయి. మీ సలహాలు, సూచనల వల్ల మీరు పనిచేసే సంస్థలు లబ్ధి పొందుతాయి. ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.

మకరం: ఈ రాశిలో నాలుగు గ్రహాల సంచారం కారణంగా ఈ రాశివారికి అన్ని విధాలా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆశించిన ప్రాంతానికి బదిలీ అవుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

మీనం: ఈ రాశికి లాభ స్థానంలో నాలుగు శుభ గ్రహాల సంచారం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏలిన్నాటి శని ప్రభావం బాగా తగ్గిపోతుంది. మీ వల్ల మీరు పనిచేసే సంస్థ బాగా లభ్ధి పొందుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు ఘన విజయం సాధిస్తాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.