
సాముద్రిక శాస్త్రం జ్యోతిషశాస్త్రంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది మానవ శరీర నిర్మాణం, అవయవాల ఆకారం, పుట్టుమచ్చలు, రేఖలు లేదా వెంట్రుకలు వంటి శరీరమపై ఉన్న గుర్తులను అధ్యయనం చేస్తుంది. దీని ఆధారంగా వ్యక్తి స్వభావం, భవిష్యత్తు, వ్యక్తిత్వాన్ని కూడా విశ్లేషిస్తారు. ఈ ప్రాచీన భారతీయ జ్ఞానం ముఖం, అరచేతిపై ఉన్న రేఖల గురించి మాత్రమే కాదు కడుపు, ఛాతీ లేదా చేతులు వంటి శరీరంలోని ఇతర భాగాలపై ఉన్న లక్షణాల గురించి కూడా చెబుతుంది. పురుషులు, స్త్రీల శరీర భాగాల గురించి ఈ శాస్త్రంలో అనేక అంచనాలు వేయబడ్డాయి.

సాముద్రిక శాస్త్రంలో స్త్రీల కడుపు గురించి కూడా కొన్ని అంచనాలు చెప్పబడ్డాయి. సర్వసాధారణంగా స్త్రీల పొట్టమీద వెంట్రుకలు ఉండవు. అయితే పురుషుల పొట్టపై చాలా వెంట్రుకలు ఉంటాయి. అయితే అరుదుగా కొంతమంది స్త్రీల పొట్టపై వెంట్రుకలు ఉంటాయి. అప్పుడు ఆ స్త్రీలు ఈ వెంట్రుకలను చాలా ఇబ్బందిని కలిగిస్తున్నాయని.. తమ అందానికి మచ్చగా మారాయని భావిస్తారు. వైద్య శాస్త్రంలో దీనికి కారణం హార్మోన్ల లేదా జన్యుపరమైనదిగా పరిగణించబడుతుంది. సాముద్రిక శాస్త్రంలో దీని గురించి అనేక రకాల అంచనాలు చెప్పబడ్డాయి. ఇందులో స్త్రీల పొట్టమీద వెంట్రుకలు ఉండటం ఒక ప్రత్యేక సంకేతంగా పరిగణించబడుతుంది.

స్త్రీల బొడ్డు వెంట్రుకలు ఒక ప్రత్యేక సంకేతం: సాముద్రిక శాస్త్రం లో బొడ్డు దగ్గర వెంట్రుకలు ఉండడాన్ని అనేక విధాలుగా విశ్లేషించించింది. బొడ్డు శరీర కేంద్ర భాగంగా పరిగణించబడుతుంది. ఇది ఆరోగ్యం, సంపద, జీవితంలో స్థిరత్వానికి చిహ్నంగా ఉంటుంది.

వీరు ధనవంతులు: సాముద్రిక శాస్త్రం ప్రకారం పొట్టపై అక్కడక్కడ, మృదువుగా జుట్టు ఉన్న స్త్రీలు ఆర్థిక విషయాల పట్ల తెలివిగా నడుచుకుంటారు. పొదుపుగా ఉంటారు. ఇలాంటి స్త్రీలు డబ్బును సరిగ్గా ఉపయోగించుకుంటారు. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటారు. ఇటువంటి స్త్రీల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.

అలాంటి స్త్రీలు శక్తివంతులు: పొట్టపై వెంట్రుకలు ఉండటం ఆరోగ్యానికి , శారీరక శక్తికి సంకేతంగా కూడా పరిగణించబడుతుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఇది బలమైన జీర్ణవ్యవస్థతో ముడిపడి ఉంటుంది. పొట్టపై సాధారణ మొత్తంలో వెంట్రుకలు ఉన్న స్త్రీలను శారీరకంగా, మానసికంగా సమతుల్యతతో ఉండేవారిగా పరిగణిస్తారు. అయితే జుట్టు అసాధారణంగా మందంగా ఉంటే అది హార్మోన్ల అసమతుల్యత లేదా ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు.

సాముద్రిక శాస్త్రం ప్రకారం పొట్టపై వెంట్రుకలు ఉన్న స్త్రీలు దృఢ సంకల్పం కలిగి ఉంటారు. స్వభావరీత్యా కష్టపడి పనిచేసేవారు. అలాంటి స్త్రీలు తమ లక్ష్యాల వైపు దృష్టి సారిస్తారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా దైర్యాన్ని వదులుకోరు. ఈ గుణం కలిగిన స్త్రీలు పని చేసే చోట, ఆఫీసులో, వ్యక్తిగత జీవితంలో ఎక్కడైనా విషయం వీరి సొంతం అవుతుంది.

వీరు అదృష్టవంతులు: పొట్టపై లేత, బంగారు రంగు జుట్టు అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అలాంటి స్త్రీలు తమ కుటుంబానికి, సమాజానికి శ్రేయస్సును తెస్తారని నమ్ముతారు. ముఖ్యంగా పొట్ట మధ్యలో జుట్టు ఒక గీతలా ఉంటే.. అది జ్ఞానాన్ని, పురాణ గ్రంథాల పట్ల ఆసక్తి, సామాజిక గౌరవాన్ని చూపుతుంది.