
వృషభం: ఈ రాశికి సప్తమంలో రవి, కుజ, శుక్ర యుతి వల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో రాజయోగం పడుతుంది. ఉన్నత పదవులను చేపట్టడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్ని కొద్ది మార్పులతో లాభాల బాట పట్టిస్తారు. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. సంతాన యోగానికి అవకాశముంది.

కర్కాటకం: ఈ రాశికి పంచమ స్థానంలో ఈ గ్రహాల కలయిక జరుగుతున్నందువల్ల ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఆదాయానికి లోటుండదు. లాభదాయక పరిచయాలు విస్తరిస్తాయి. విలాసవంతమైన జీవితం అనుభవిస్తారు. జీవనశైలి మారిపోతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. శుభవార్తలు వింటారు.

తుల: ఈ రాశికి ధన స్థానంలో మూడు గ్రహాలు సంచారం చేయడం, ఈ గ్రహాలను భాగ్య స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్న తులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.

వృశ్చికం: ఈ రాశిలో రాశ్యధిపతి కుజుడిని మరో రెండు గ్రహాలు కలవడం, దాన్ని భాగ్య స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల ఆర్థిక విషయాలు అనుకూలంగా సాగిపోతాయి. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయాలు వరిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు మారడం, హోదా పెరగడం జరుగుతుంది. వ్యాపారాలు లాభాలను పండిస్తాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

మకరం: ఈ రాశికి లాభ స్థానంలో ఈ గ్రహాల కలయిక, ఉచ్ఛ గురువు వీక్షణ జరుగుతున్నందువల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. మంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సునాయాసంగా నెరవేరుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి, ఉద్యోగంలో స్థిరత్వం సంపాదించడానికి అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. అనారోగ్యాల నుంచి ఊరట లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి.

కుంభం: ఈ రాశికి దశమ స్థానంలో మూడు శుభ గ్రహాల సంచారం జరగడం, వాటిని గురువు వీక్షించడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించి మనశ్శాంతి పొందుతారు. రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ మూలక ధన లాభం, గుర్తింపు లభిస్తాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందుతాయి. పిత్రార్జితం లభిస్తుంది.