
జ్యోతిష్యశాస్త్రంలో సంఖ్యాశాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే చాలా మంది సంఖ్యా శాస్త్రం ద్వారా తమ భవిష్యత్తు తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారం, 2026 ఏ తేదీల్లో పుట్టిన వారికి లక్కు తీసుకొస్తుంది. ఈ సంవత్సరం ఏ నెలలో ఏ తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం కలిసి వస్తుంది, ఎవరు ఉన్నత స్థాయికి వెళ్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలో జన్మించిన వారైనా సరే, తేదీ 1,28,19,10వ తేదీనా జన్మిస్తారో వారి నెంబర్ 1. అయితే న్యూమరాలజీ ప్రకారం ఎవరైతే నెంబర్ 1 సంఖ్యలో జన్మిస్తారో వారికి 2026 చాలా అద్భుతంగా ఉంటుంది, అంతే కాకుండా, వీరు ఏ పని ప్రారంభించినా సక్సెస్ అవుతారు. ఖర్చులు తగ్గిపోయి, ధనం పెరుగుతుంది. ఈ సంవత్సరం ఈ సంఖ్యలో జన్మించిన వారికి వివాహం జరిగే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా, వీరు తమ భాగస్వామితో చాలా ఆనందంగా గడుపుతారు.

న్యూమరాలజీ ప్రకారం, ఎవరైతే 3,21,12,30వ తేదీల్లో జన్మిస్తారో వారు నెంబర్ 3 కిందకు వస్తారు. అయితే నెంబర్ 3లో ఉండే వారికి 2026 అదృష్టాన్ని తీసుకొస్తుంది. వీరికి రోజు రోజుకు ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా కెరీర్ చాలా అద్భుతంగా కొనసాగుతుంది. ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయం స్థిరంగా ఉంటుంది. వీరు చాలా ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు కలిసి వస్తుంది. చాలా కాలంగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి త్వరలో మంచి ఉద్యోగం లభించే ఛాన్స్ ఉన్నదంట.

సంఖ్యా శాస్త్రం ప్రకారం, చాలా మంది తమ కెరీర్ గురించి తెలుసుకుంటారు. అయితే ఎవరైతే నెంబర్ 5 న జన్మిస్తారో వారు బుధ గ్రహం అనుగ్రహం వలన కెరీర్ పరంగా అద్భుతమైన ఫలితాలను అందుకొని చాలా మందికి ఆదర్శంగా నిలుస్తారంట. సంఖ్యా శాస్త్రం ప్రకారం నెల ఏదైనా సరే, ఎవరైతే 2,14,23 తేదీన జన్మిస్తారో వారు నెంబర్ 5 కిందకు వస్తారు. అలాంటి వారు ముఖ్యంగా మీడియా , డిజిటల్ రంగంలో ఉన్నవారు అత్యుత్తమమైన ఫలితాలను పొందుతారని చెబుతున్నారు పండితులు.

ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో జన్మించిన వారికి 2026 మంచి ఫలితాలనిస్తుందని చెబుతున్నారు సంఖ్యా శాస్త్ర నిపుణులు. కెరీర్ పరంగా, వ్యాపార పరంగా చాలా బాగుంటుందంట. వీరు ఆర్థికంగా అనేక ప్రయోజనాలు పొందుతారు. వీరికి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.