
న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ప్రత్యేక స్వభావాన్ని కలిగి ఉంటారంట. ముఖ్యంగా కొంత మంది అమ్మాయిలు పుట్టింటికి అదృష్టాన్ని తీసుకొస్తే, మరికొంత మంది అమ్మాయిలు అత్తింటి వారికి అదృష్టాన్ని తీసుకొస్తారు. అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏ తేదీల్లో జన్మించిన అమ్మాయిలు అత్తింటి వారికి లక్కు తీసుకొస్తారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

జనన మూల సంఖ్య 3 ఉన్న అమ్మాయిలు వివాహం తర్వాత అత్తింటి వారికి అదృష్టాన్ని తీసుకొస్తారంట. వీరికి వివాహం తర్వాత ఊహించిని అదృష్టం కలుగుతుంది. అలాగే వీరు వారి అత్తింటిలో ఉన్న సమయం మొత్తం ఆనందంతో నిండిపోతుందంట. వీరి వెంట అదృష్టం ఉండటమే కాకుండా, వీరు తమ అత్తింటి వారికి కూడా లక్కును తీసుకొస్తారు, తమ అత్తింటి రూపురేఖలనే మార్చేస్తారంట.

జనన మూల సంఖ్య 3 వచ్చే వారి పుట్టిన తేదీలు ఇవే. నెల ఏది అయినా సరే 3,12,21,30 తేదీల్లో ఏ అమ్మాయిలు అయితే జన్మిస్తారో వీరు జనన మూల సంఖ్య 3 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారికి అదృష్టం, జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుందంట.

ఈ తేదీల్లో జన్మించిన అమ్మాయిలు మంచి ఆకర్షణతో ఉంటారు. తమ అందం, మాటతీరుతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటారు. అంతే కాకుండా వీరికి బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందంట. కష్టపడే తత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు.

ఎవరు జనన మూల సంఖ్య 3 ఉంటుందో వారు చాలా తెలివైన వారు, ప్రతి పనిని ఎంతో తెలివిగా చేస్తారు. చక్కగా ఆలోచించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా వీరు విద్యపరంగా కూడా చాలా ఉన్నతస్థాయిలో ఉంటారు. ఇతరులను తమ మాటతీరుతో ఆకట్టుకుంటారు. వీరు ఎక్కడున్నా వారికి అదృష్టమే కలుగుతుంది.