కోల్‌కతాలోని శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్‌లో దుబాయ్ బుర్జ్ ఖలీఫా ప్రతిబింబించేలా ఒక ప్రత్యేకమైన పండల్ ను నిర్మించారు. దుబాయ్ బుర్జ్ ఖలీఫా థీమ్ ఆధారంగా క్లబ్ లేక్-టౌన్‌లో 145 అడుగుల పండల్‌ని రూపొందించారు.
ప్రతి సంవత్సరం, మేము ఐకానిక్ భవనాల ప్రతిరూపం రూపంలో మండపాలను నిర్మిస్తామని శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ ప్రెసిడెంట్ సుజిత్ బోస్ చెప్పారు. ఇంతకుముందు.. పారిస్ ఒపెరా, కేదార్‌నాథ్ , పూరి జగన్నాథ ఆలయం థీమ్ లతో దుర్గమ్మ మండలపాలను నిర్మించామని తెలిపారు.
ఈ బుర్జ్ ఖలీఫా పండల్ రాత్రిపూట ప్రత్యేకంగా వెలుగులు విరజిమ్ముతుంది. ఇందుకోసం ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఇక ఈ మండపాన్ని 250 మంది కార్మికులు రెండు నెలలపాటు కష్టపడి నిర్మించారు.
ఓ వైపు దుర్గమ్మని పూజిస్తూనే మరో వైపు సామజిక సేవలను కూడా నిర్వహిస్తున్నామని బోస్ చెప్పారు. COVID-19 నిబంధనలు పాటిస్తూ.. దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.