
మేషం: ఈ రాశివారి జీవితాలను ఈ లక్ష్మి, గజకేసరి యోగాలు పూర్తిగా మార్చేయబోతున్నాయి. కొద్ది ప్రయత్నంతో సగటు వ్యక్తి సైతం మహా భాగ్యవంతుడయ్యే అవకాశం ఉంది. సిరి సంపదలు, భోగ భాగ్యాలు బాగా వృద్ధి చెందుతాయి. ఆస్తి తగాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తి పాస్తుల విలువ పెరుగుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ఒక ప్రముఖుడిగా గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది.

మిథునం: ఈ రెండు మహా యోగాల వల్ల ఈ రాశివారికి ధన ధాన్య సమృద్ధి కలుగుతుంది. షేర్లు, స్పెక్యు లేషన్లతో సహా ఆదాయ ప్రయత్నాలన్నీ అంచనాలకు మించి లాభాలనిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో అధికార లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. సంతాన ప్రాప్తి విషయంలో శుభవార్త వింటారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

కర్కాటకం: ఈ రాశికి ఈ రెండు మహా యోగాల వల్ల కొద్ది శ్రమతో అత్యధికంగా ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు అపారంగా లాభిస్తాయి. సగటు వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంటుంది. ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. సుఖసంతోషాలకు, మనశ్శాంతికి లోటుండదు. ఆరోగ్య లాభం కలుగుతుంది.

కన్య: ఈ రాశికి ఈ రెండు మహా యోగాల వల్ల ధన, లాభ స్థానాలు పటిష్ఠం అవుతున్నందు వల్ల కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులకు మార్గం సుగమం అవుతుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించే అవకాశం ఉంది.

తుల: రాశ్యధిపతి శుక్రుడితో ఈ రాశిలో చంద్రుడు యుతి చెందడం, దశమంలో ఉచ్ఛలో ఉన్న గురు వుతో గజకేసరి యోగం ఏర్పడడం వల్ల ఈ రాశివారు ఈ మూడు రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, చేసే ఆలోచనలు, చేపట్టే కార్యక్రమాలు బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే అనేక రెట్లు మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించుతుంది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది.

మకరం: ఈ రాశివారికి లక్ష్మీయోగం, గజకేసరి యోగం వల్ల జీవితంలో పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉండడం వల్ల జీవనశైలిలో మార్పు వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మనసులోని కోరికల్లో చాలా భాగం నెరవేరుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. సంతాన యోగానికి బాగా అవకాశం ఉంది.