కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): రవి, బుధ, కుజ గ్రహాలు అనుకూలంగా ఉన్నందు వల్ల ఉద్యోగ సంబంధమైన సమస్యలు పరి ష్కారం కావడం, ఆస్తి వివాదం ఒకటి సమసి పోవటం, ఉద్యోగం మారటానికి చేస్తున్న ప్రయ త్నాలు సఫలం కావడం, ఆదాయం పెరగటం వంటివి జరిగే అవకాశం ఉంది. ఆహార విహారాల్లో కచ్చితంగా జాగ్రత్తలు పాటించడం మంచిది. జీవిత భాగస్వామి ఆశించిన స్థాయిలో పురోగతి చెందడం జరుగుతుంది. అష్టమ శని కారణంగా ముఖ్యమైన పనులు ఆలస్యం కావడం, కుటుం బంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తడం, అనా రోగ్యాలు ఇబ్బంది పెట్టడం వంటివి జరిగే అవ కాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్త అందు తుంది. ఒక మంచి శుభ పరిణామం చోటు చేసు కుంటుంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి.