
మిథునం: రాశ్యధిపతి బుధుడు పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారు భాగ్యవంతులు అవకాశాలు అంది వస్తాయి. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా ఊహించని ఫలి తాలు అందుతాయి. ఆస్తిపాస్తులకు సంబంధించిన సమస్యలు, వివాదాలన్నీ పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభించి పదోన్నతితో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.

కన్య: రాశ్యధిపతి బుధుడు ధన స్థానంలో సంచారం చేయడం, దాన్ని గురువు వీక్షించడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా అందలాలు ఎక్కడం, ఊహించని స్థాయిలో జీతభత్యాలు పెరగడం జరుగు తుంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగులు సరికొత్త నైపుణ్యాలను అలవరచుకుంటారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. షేర్లు బాగా లాభిస్తాయి. ఆర్థిక సమస్యలు సమసిపోతాయి.

తుల: ఈ రాశిలో బుధుడు సంచారం చేయడం, దాన్ని భాగ్య స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధికి అవకాశాలు, మార్గాలు బాగా విస్తరిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అయి, విలువైన ఆస్తి కలిసి వస్తుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.

ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో బుధుడు సంచారం చేయడం, దాన్ని రాశ్యధిపతి గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతి, జీతభత్యాల పెరుగుదల ఖాయమని చెప్పవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. రావలసిన డబ్బంతా చేతికి అందుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

మకరం: ఈ రాశికి దశమ స్థానంలోకి బుధుడు ప్రవేశించడం, దాన్ని ధన కారకుడు గురువు వీక్షించడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా అందలాలు ఎక్కుతారు. రాజపూజ్యాలు పెరుగుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపారంగా లాభిస్తాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది.వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆదాయానికి లోటుండదు.

కుంభం: ఈ రాశికి భాగ్య స్థానంలో బుధు సంచారం, పంచమ స్థానం నుంచి గురువు వీక్షణ వల్ల వీరికి ఒకటికి రెండుసార్లు మహాభాగ్య యోగాలు పట్టే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావా దేవీలతో సహా అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ రెట్టింపు ఫలితాలనిస్తాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమై, ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి సంబంధించి శుభవార్త వింటారు. పిత్రార్జితం లభిస్తుంది.