
వృషభం: ఈ రాశికి అత్యంత శుభుడైన బుధుడు సప్తమ స్థానంలో వక్రించినందువల్ల, ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నమైనా తప్పకుండా కలిసి వస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఆర్థిక ఒప్పందాలు, ఆస్తి ఒప్పందాలు కుదురుతాయి. రుణ సమస్యల నుంచి పూర్తిగా బయటపడడంతో పాటు ఆదాయ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. వ్యక్తిగత, ఉద్యోగ సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కర్కాటకం: ఈ రాశికి బుధుడు పంచమ స్థానంలో వక్రించడం వల్ల ఉద్యోగంలో అధికారులు ఈ రాశివారి సలహాలు, సూచనలతో అత్యధికంగా లబ్ధి పొందుతారు. సమర్థతకు, ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువగా ఆర్థిక లాభాలు పొందడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడి, రాబడి అంచనాలను మించుతుంది.

తుల: ఈ రాశికి ధన స్థానంలో బుధుడు వక్రగతి పట్టడం వల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. రావలసిన డబ్బుతో పాటు, రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో ఊహించని పదోన్నతికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా డిమాండ్ బాగా పెరిగి, లాభాలు అందుకోవడం జరుగుతుంది. అనేక మార్గాల్లో బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

వృశ్చికం: ఈ రాశిలో సంచారం చేస్తున్న బుధుడు వక్రగతి పట్టడం వల్ల అనేక విధాలుగా జీవితంలో పురోగతి చెందడం జరుగుతుంది. ఉద్యోగంలోనూ, వృత్తి, వ్యాపారాల్లోనూ స్థిరత్వం లభిస్తుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. సమర్థతకు ఇంటా బయటా గుర్తింపు లభిస్తుంది. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు.

మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన బుధుడు లాభ స్థానంలో వక్రించడం వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాల వంటివి అంచనాలకు మించి లాభాలనిస్తాయి. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. సంతాన యోగం కలుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

కుంభం: ఈ రాశికి దశమ స్థానంలో బుధుడు వక్రించడం వల్ల కెరీర్ పరంగా ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగులు సరికొత్త నైపుణ్యాలను అలవరచుకుంటారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. పిల్లలకు విదేశీ విద్యకు అవకాశముంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి.