
మేషం: చతుర్థ స్థానంలో రవితో కలిసి సంచారం చేస్తున్న బుధుడు అస్తంగత్వం చెందడం వల్ల ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి, ఆర్థిక సమస్యల పరిష్కారం తప్పకుండా కలుగుతాయి. ముఖ్యంగా సోదరులతో ఆస్తి సమస్యలు పరిష్కారం కావడానికి బాగా అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గిపోతుంది.

వృషభం: ఈ రాశికి అత్యంత శుభుడైన బుధుడు తృతీయ స్థానంలో అస్తంగతుడైనందువల్ల ఉద్యోగంలో మీ సమర్థతకు, చాతుర్యానికి, నైపుణ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అధికారులకు మీ సలహాలు, సూచనలు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల్ని చాలావరకు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు పురోగతి చెందుతాయి. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ ఊహించని లాభాలనిస్తాయి.

కర్కాటకం: ఈ రాశిలో బుధుడు అస్తంగతుడు కావడం వల్ల విదేశీయానానికి, విదేశీ అవకాశాలకు ఆటంకాలు తొలగిపోయి, మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగంలో తప్పకుండా హోదా పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా నూరు శాతం సఫలం అవుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.

తుల: ఈ రాశికి దశమ స్థానంలో బుధుడు దగ్ధం కావడం వల్ల ఉద్యోగ జీవితంలో శుభవార్తలు ఎక్కువగా వింటారు. కెరీర్ గ్రాఫ్ పైకి దూసుకుపోతుంది. ధనాదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు ప్రయోజనం పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులతో లాభాలు పండిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల బాగా కలిసి వస్తుంది.

మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో బుధుడు దగ్ధం కావడం వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ధన లాభాలు ఎక్కువగా కలుగుతాయి. ఏ పని చేపట్టినా, ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమవుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఊహించని పురోగతి ఉంటుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. ఆరోగ్యం బాగా మెరుగు పడుతుంది.

మీనం: ఈ రాశికి పంచమ స్థానంలో బుధుడు దగ్ధం కావడం వల్ల ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. మీ సమర్థత మీద అధికారులకు నమ్మకం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సంపద బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు.