
2026 ఫిబ్రవరి 23న కుజగ్రహం శని రాశి అయినా కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 2,2026 వరకు కుజగ్రహం అక్కడే ఉంటాడు. అయితే ఇప్పటికే ఆ రాశిలో రాహువు సంచరిస్తున్నాడు. రాహు గ్రహం డిసెంబర్ 5 వరకు అదే రాశిలో సంచరిస్తుంటాడు. ఇప్పుడు కుజ గ్రహం సంచారం వలన రెండు గ్రహాల కలయిక అనేది ఒక విస్ఫోటక కలయికను సృష్టిస్తుంది. ఇది పన్నెండు రాశులపై దాని ప్రభావం చూపగా, మూడు రాశుల వారిపై మాత్రం ఎక్కువగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

మేష రాశి : మేష రాశి వారికి చాలా కష్టకాల సమయం. వీరు రెండు గ్రహాల కలయిక వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాకుండా తోటి ఉద్యోగుల వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. సీనియర్స్ నుంచి ఒత్తిడి, అనారోగ్య సమస్యలు ఇవన్నీ మానసిక ఆందోళనను కలిగిస్తాయి. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో వీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురు అవుతాయి. కాబట్టి మేష రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి కుజ గ్రహం, రాహు గ్రహం కలయిక వలన ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. కుటుంబంలో కలహాలు ఎక్కువ అవ్వడం, ఆర్థిక ఇబ్బందులు చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ సమయంలో వీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవడం అవసరం. అలాగే ఈ రాశి వారు భాగస్వామ్య వ్యాపారం చేయడం మంచిది కాదు. పెట్టుబడులు పెట్టడం వలన కూడా నష్టపోయే ఛాన్స్ ఎక్కువగా ఉన్నది కాబట్టి, జాగ్రత్త అవసరం.

ధనస్సు రాశి : అంతే కాకుండా దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్ర్తత్త అవసరం. వ్యాపారస్తులు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆలోచించి తీసుకోవాలి. లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, సమస్యలను సృష్టిస్తాయి.

మకర రాశి : మకర రాశి వారు కుజ గ్రహం, రాహు గ్రహం కలయిక వలన ఎక్కువ ఆర్థిక నష్టాలు ఎదుర్కుంటారు. అలాగే రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు ఎక్కువ నష్టపోయే ఛాన్స్ ఉంది. ఉద్యోగస్తులు ఎంత కష్టపడినా శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి.