Makar Sankranti: మకర సంక్రాంతిని ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో తెలుసా..

|

Jan 11, 2025 | 6:20 PM

హిందువులు జరుపుకునే పండగలలో మకర సంక్రాంతి అతి పెద్ద పండగ. ఈ రోజు నుంచి ఉత్తరాయణ కాలం మొదలవుతుంది. ఈ రోజున చేసే స్నానం, దానానికి విశిష్ట స్థానం ఉంది. ఈ పండగను తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు వివిధ పేర్లతో భారతదేశం అంతటా జరుపుకుంటారు. ఒకొక్క రాష్ట్రంలో ఒక్క సాంప్రదాయ పద్దతిలో జరుపుకుంటారు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో మకర సంక్రాంతిని ఏ రూపంలో జరుపుకుంటారో తెలుసుకుందాం.

1 / 9
హిందూ మతంలో మకర సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజుని మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు పవిత్ర నదులలో స్నానమాచారిస్తారు. అనంతరం శక్తి కొలదీ దానది కార్యక్రమాలు నిర్వహిస్తారు. హిందూ పురాణ గ్రంథాలలో ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం, దానం చేయడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయని విశ్వాసం.

2 / 9
పంచాంగం ప్రకారం ఈసారి సూర్యభగవానుడు జనవరి 14వ తేదీ ఉదయం 9.03 గంటలకు మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. అందుకే ఈ రోజున మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో మకర సంక్రాంతిని జరుపుకుంటారు, అయితే ఈ మకర సంక్రాంతిని వివిధ రూపాలలో వివిధ సంప్రదాయాలతో జరుపుకుంటారని మీకు తెలుసా. మంకర సంక్రాంతిని ఏ రాష్ట్రంలో ఏ రూపంలో, ఏ సంప్రదాయాలతో జరుపుకుంటారో ఈ రోజు తెలుసుకుందాం.

3 / 9
తమిళనాడు: దక్షిణ భారత దేశంలో మాత్రమే కాదు ఉత్తర భారతదేశంలో కూడా మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. అయితే పండగను జరుపుకునే విధానం, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. తమిళనాడులో మకర సంక్రాంతిని పొంగల్‌గా జరుపుకుంటారు. పొంగల్ పండుగ నాలుగు రోజుల పాటు ఉంటుంది. ఈ పండగలో రైతులు తమ ఎద్దులను అలంకరించి పూజిస్తారు. అలాగే వ్యవసాయానికి సంబంధించిన ఇతర వస్తువులను పొంగల్ రోజున పూజిస్తారు. ఈ పండుగ రైతుల శ్రేయస్సు చిహ్నంగా పరిగణించబడుతుంది.

4 / 9
ఆంధ్రప్రదేశ్: ఇక్కడ కూడా సంక్రాంతి పండగను భోగి, సంక్రాంతి, కనుమగా కొన్ని ప్రాంతాల్లో.. మరికొన్ని ప్రాంతాల్లో ముక్కనుమగా నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. భోగి రోజున మంటలు వేసి పాత వస్తువులను దహనం చేస్తారు. సంక్రాంతి రోజున పెద్దల పండగా భావించి పెద్దలను పూజిస్తారు. కనుమ రోజున పశువులను పూజిస్తారు. తెలంగాణాలో కూడా మకర సంక్రాంతి పండగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు.

5 / 9
కేరళ: కేరళలో మకర సంక్రాంతికి మకర విళక్కు అని పేరు. ఈ రోజున శబరిమల ఆలయానికి సమీపంలో ఆకాశంలో మకరజ్యోతి కనిపిస్తుంది. మకర జ్యోతిని భారీ సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు దర్శించుకుంటారు.

6 / 9
కర్ణాటక: కర్ణాటకలో ఈ పండుగను ఏలు బిరోదు అంటారు. ఇక్కడ ఈ రోజున మహిళలు కనీసం 10 కుటుంబాలతో చెరకు, నువ్వులు, బెల్లం, కొబ్బరితో తయారు చేసిన వస్తువులను మార్పిడి చేసుకుంటారు.   రైతులు వారి ఎద్దులు, ఆవులను రంగు రంగు దుస్తులతో అలంకరిస్తారు. ఆ తర్వాత ఎద్దులతో పాటు నిప్పులపై నడుస్తారు.

7 / 9
పంజాబ్: పంజాబ్‌లో మకర సంక్రాంతిని మాఘిగా జరుపుకుంటారు. మాఘిలో శ్రీ ముక్త్సార్ సాహిబ్‌లో ఒక జాతర నిర్వహిస్తారు. ఇక్కడ ప్రజలు డ్యాన్స్ చేస్తారు. పాటలు పాడతారు. ఇక్కడ ఈ రోజున కిచడీ, బెల్లం, ఖీర్ తినే సంప్రదాయం ఉంది

8 / 9
గుజరాత్‌: మకర సంక్రాంతిని ఉత్తరాయణంగా జరుపుకుంటారు. ఉత్తరాయణం రెండు రోజులు ఉంటుంది. ఉత్తరాయణం నాడు గుజరాత్‌లో గాలిపటాల పండుగ జరుగుతుంది. ఈ సీజన్ లో లభించే కూరగాలతో చేసిన వంటకాలు చేసుకుంటారు. అంతే కాకుండా బెల్లంతో స్వీట్లు ప్రత్యేకంగా చేసుకుని తింటారు.

9 / 9
రాజస్థాన్: సంక్రాంతి అంటారు. ఇక్కడ స్త్రీలు ఒక ఆచారాన్ని అనుసరిస్తారు. దీనిలో వారు 13 మంది వివాహిత స్త్రీలకు ఇల్లు, అలంకరణ లేదా ఆహారానికి సంబంధించిన వస్తువులను అందిస్తారు.