
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఉండే ప్రాముఖ్యతనే వేరు. అయితే గ్రహాలు కొన్ని సార్లు నక్షత్రసంచారం, మరికొన్ని సార్లు రాశుల సంచారం చేస్తాయి. అంతే కాకుడా కొన్ని సార్లు గ్రహాల కలయిక కూడా జరుగుతుంది. అయితే గ్రహాల్లో ఒక్కటైన చంద్రగ్రహం నవరాత్రి ఉత్సవాల సమయంలో సంచారం చేయబోతుంది. దీంతో శక్తివంతమైన మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది.

సెప్టెంబర్ 22న చంద్ర గ్రహం, కుజ గ్రహం కలయిక జరగబోతుంది. దీని వలన నాలుగు రాశుల వారికి విశేష ప్రయోజనాలు చేకూరనున్నాయి. అంతే కాకుండా ఈ రెండు గ్రహాలు కూడా శుభ స్థానంలో ఉండటం వలన, నవరాత్రి ఉత్సవాలు సమయంలో మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

కుంభ రాశి : చంద్ర గ్రహం, కుజ గ్రహం కలయిక వలన కుంభ రాశి వారికి అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. అనుకున్న పనుల్లో విజయం లభిస్తుంది. నిరుద్యోగులకు అద్భుతమైన అకాశాలు వస్తాయి. చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి జాబ్ దొరికే ఛాన్స్ ఉన్నది.

మకర రాశి : మకర రాశి వారికి నవరాత్రి ఉత్సవాల సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు అద్భుతమైన లాబాలు అందుకుంటారు. చాలా సంతోషంగా గడుపుతారు.

తుల రాశి : తుల రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాల సమయంలో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఎవరైతే చాలా రోజుల నుంచి స్థిరాస్తి కొనుగోలు చేయాలని భావిస్తున్నారో, వారి కోరిక నెరవేరే ఛాన్స్ ఉంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.