ప్రస్తుతం మేష రాశిలో సంచరిస్తున్న గురు గ్రహం ఈ నెల 5వ తేదీ(మంగళవారం) నుంచి వక్రించనుంది. డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ వక్రగతి కొనసాగుతుంది. గురు గ్రహం వక్రించడం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. శుభ ఫలితాలను ఇవ్వడంలో వేగం పెరుగుతుంది. జ్యోతిషశాస్త్రంలో దీన్ని చేష్టాబలం అంటారు. గురువు వక్రించడం, అందులోనూ మిత్రక్షేత్రమైన మేష రాశిలో వక్రించడం, రాహువు ప్రభావం నుంచి చాలావరకు బయటపడడం వల్ల ఆరు రాశులవారికి మహా భాగ్య యోగాన్ని పట్టించడం జరుగుతుంది. ఆ ఆరు రాశులు మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మీనం. ఏ విధంగా యోగాన్ని పట్టించబోతున్నాడో పరిశీలిద్దాం.