
వృషభం: ఈ రాశికి ధన స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు గురువుతో యుతి చెందడం వల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది, షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు అపార ధన లాభం కలిగిస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది.

మిథునం: ఈ రాశిలో గురు, శుక్రులు కలవడం వల్ల ఈ రాశిలో పుట్టిన అతి సామాన్య వ్యక్తి సైతం సంపన్ను డయ్యే అవకాశం ఉంటుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఉద్యోగంలో ఊహించని పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ధన లాభాలు కలుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. సంపన్న స్థాయి వ్యక్తితో పెళ్లి కావడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది.

సింహం: ఈ రాశికి లాభ స్థానంలో గురు, శుక్రుల కలయిక వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. తల్లితండ్రుల నుంచి ఆస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో హోదాతోపాటు జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాల వల్ల విశేష లాభాలు కలుగుతాయి.

తుల: రాశినాథుడు శుక్రుడు భాగ్యస్థానంలో ధన కారకుడు గురువుతో కలవడం వల్ల ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. విదేశీ సంపాదనను అనుభవించే యోగం పడుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను దాటుతాయి.

ధనుస్సు: రాశ్యధిపతి గురువుతో సప్తమ స్థానంలో శుక్రుడు కలవడం వల్ల ఎటువంటి దాంపత్య సమస్య లైనా బాగా అనుకూలంగా పరిష్కారమవుతాయి. సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి కావడం వంటివి జరుగుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా ఆశించిన పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.

కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో గురు, శుక్రుల కలయిక వల్ల తప్పకుండా సంతాన యోగం కలుగుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభించి అధికార యోగం పడుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు పెంపొందుతాయి. వృత్తి, వ్యాపారాలు అంచనాలకు మించి పురోగతి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు, లాటరీల వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.