- Telugu News Photo Gallery Spiritual photos Hyderabad Khairatabad Ganesh idol ready devotees queue to see idol
Vinayaka Chavithi: ఖైరతాబాద్‌లో మొదలైన చవితి సందడి.. రేపు మొదటి పూజలో పాల్గొననున్న తమిళ సై, బండారు దత్తాతేయ
Vinakaya Chavithi: వినాయక చవితి సందడి దేశ వ్యాప్తంగా మొదలైంది. మండపాల్లో గణేశుడు కొలువుతీరుతున్నాడు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వినాయక చవితి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. కరోనా నిబంధనలను పాటిస్తూ.. విఘ్నేశ్వరుడి ఉత్సవాలను జరపడానికి భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తెలంగాణాలో ఖైరతాబాద్ లో శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతిగా కొలువుదీరనున్న గణేశుడు కూడా రెడీ అయ్యాడు. రేపు ఉదయం 11.30 గంటలకు మహాగణపతికి తొలిపూజను నిర్వహించనున్నారు.
Updated on: Sep 09, 2021 | 3:13 PM

హైదరాబాదులోని ఖైరతాబాద్ గణేశుడు సిద్ధమయ్యాడు. శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతి తొలిపూజలో తెలంగాణ గవర్నర్ తమిళ సై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొననున్నారు.

వినాయక చవితికి ఐదు రోజుల ముందే పూర్తయిన పంచముఖ రుద్రగణపతిని చూసేందుకు భక్తులు అప్పుడే క్యూకడుతున్నారు. గతేడాది కరోనా కారణంగా 11 అడుగుల విగ్రహానికే పరిమితమైన గణేషుడు.. ఈసారి ఉత్సవ నిర్వాహకులు 40 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పు, 28 టన్నుల బరువున్న వినాయకుడిని తీర్చిదిద్దారు.

మహాగణపతి కి ఇరువైపులా క్రిష్ణ కాళి, కాల నాగేశ్వరిల దర్శనమివ్వనున్నారు. ఐదు రోజుల ముందే రెడీ అయిన ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. గణపతి విగ్రహం వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.

ఖైరతాబాద్‌లో వినాయకుడిని ఏర్పాటు చేయడం ప్రారంభించి 65 ఏళ్లు నిండిన సందర్భంగా రెండేళ్ల క్రితం 65 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గత ఏడాది కరోనా నేపధ్యంలో చవితి వేడుకలకు కేవలం 9 అడుగుల గణేష్ ప్రతిమను ఉత్సవ కమిటీ ప్రతిష్ఠించింది. అయితే కరోనా నేపథ్యంలో దర్శనానికి భక్తులెవరినీ అనుమతించలేదు. ఈ ఏడాది ఉత్సవాలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తున్నారు. ఈ నెల 10 గణేశ్ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి.

పది రోజుల పాటు గణేశ్ నవరాత్రులను నిర్వహించనున్నారు. అనంతరం వినాయకుడి విగ్రహాన్ని సెప్టెంబర్ 19న అనంత చతుర్ధశి రోజున నిమజ్జనం చేయనున్నామని నిర్వాహకులు వెల్లడించారు. ట్యాంక్‌బండ్ స్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు.





























