2 / 6
వృషభం: భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న రాశ్యధిపతి శుక్రుడి మీద గురు దృష్టి పడడం వల్ల అనేక శుభ యోగాలు కలుగుతాయి. సుమారు నెల రోజుల పాటు జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగే అవ కాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా, సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు బాగా వృద్ది చెందుతాయి. వ్యాపారాలు అభివృద్ది బాట పడతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి.