Kanipakam Temple: తిరుమల శ్రీవారి తరహాలో కాణిపాకం వినాయకుడికి స్వర్ణ రథం.. ఫోటోలు చూడండి

| Edited By: Janardhan Veluru

Feb 17, 2022 | 3:02 PM

Kanipakam: తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారు మాడ వీధుల్లో స్వర్ణ రథం(Golden Chariot )పై ఊరేగినట్లు.. ఇక నుంచి కాణిపాకం మాడ వీధుల్లో విఘ్నేశ్వరుడు(Vigneswara) స్వర్ణ రథంలో ఊరేగనున్నారు. స్వామివారి ఊరేగింపు కోసం శ్రీస్వయంభూ వరసిద్ధి వినాయకుడికి స్వర్ణరథం ఏర్పాటు చేశారు.

1 / 5
కాణిపాకం ఆలయంలో ఉత్సవాలు జరిగే సమయంలో మాడ వీధుల్లో ఊరేగింపు కోసం తయారు చేసిన బంగారు రథాన్ని విశాఖ  శారదా పీఠాధిపతి స్వరూపానంద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో   దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, స్వాత్మానందేంద్ర సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

2 / 5
కలశ పూజ, హోమం, పూర్ణాహుతితో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా స్వర్ణ రథాన్ని  ప్రారంభించారు. నూతన స్వర్ణ రథంపై సిద్ధి, బుద్ధి సమేత గణనాధున్ని కాణిపాక మాడవీధుల్లో ఘనంగా ఊరేగించారు.

3 / 5
స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న అనంతరం.. స్వామివారికి ఏర్పాటు చేసిన స్వర్ణరథం శిలాఫలకాన్ని ఆవిష్కరించి..  స్వర్ణ రథాన్ని ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు.

4 / 5
ఈ వరసిద్ధి వినాయక స్వర్ణరథాన్ని 25 కిలోల బంగారాన్ని వినియోగించి, సుమారు 6.50 కోట్ల రూపాయలతో నిర్మించారు.

5 / 5
కాణిపాకం ఆలయానికి బంగారు రథం సమకూరడం చాలా సంతోషంగా ఉందని  స్వరూపానంద స్వామి చెప్పారు. రాష్ట్రంలోని మిగతా ఆలయాల్లో కూడా ఇదే తరహాలో బంగారు లేదా వెండి రధాలు అందుబాటులోకి రావాల్సి ఉందన్నారు. (Photos Courtesy: Raju, Chittoor Dist, TV9 Telugu)