Business Astrology: వ్యాపారాల్లో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం..! ఇందులో మీ రాశి ఉందా?

Edited By: Janardhan Veluru

Updated on: Aug 13, 2025 | 5:20 PM

Financial Forecasts 2025: బుధుడు అధిపతి అయిన మిథున రాశిలో ధన కారకుడైన గురువు ఉండడం వల్ల, వ్యాపార కారకుడైన బుధుడు మరో మూడు నెలల పాటు కర్కాటక, సింహ, కన్యారాశుల్లో అనుకూల సంచారం చేస్తున్నందువల్ల కొన్ని రాశుల వారు వ్యాపారాల్లో ఒక వెలుగు వెలగబోతున్నారు. వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, ధనూ రాశులవారికి వ్యాపారాల్లో పట్టిందల్లా బంగారం కాబోతోంది. ఉద్యోగాలు చేస్తూ పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారులు పెట్టుబడులు పెంచడానికి, లాభాలు గడించడానికి, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభించడానికి అవకాశం ఉంది.

1 / 6
వృషభం: డబ్బును కూడబెట్టడంలోనూ, దాన్ని సరిగ్గా మదుపు చేయడంలోనూ సిద్ధహస్తులైన ఈ రాశుల వారికి సమయం మరింత అనుకూలంగా ఉంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేసినా తప్పకుండా సఫలం అవుతుంది. వ్యాపారాల్లో బాగా యాక్టివిటీ పెరుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచడానికి, వ్యాపారాలను విస్తరించడానికి అవకాశం ఉంది. ఈ రాశివారు తమకు పరిజ్ఞానం ఉన్న ప్రతి నైపుణ్యాన్నీ ఆదాయ వృద్దికి, వ్యాపార వృద్ధికి వినియోగించడం జరుగుతుంది.

2 / 6
మిథునం: రాశ్యధిపతి బుధుడు వ్యాపార కారకుడైనందువల్ల, ఆ బుధుడు ధన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు తప్పకుండా వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధించే అవకాశం ఉంది. వీరిలో దూరదృష్టి, వ్యాపార ధోరణి, ఆచితూచి ఖర్చు చేసే తత్వం ఎక్కువగా ఉన్నందువల్ల వీరు ఏ వ్యాపారం ప్రారంభించినా విజయం సాధించడం జరుగుతుంది. ఒకపక్క ఇతర ఆదాయవృద్ది ప్రయత్నాలు చేపడుతూనే షేర్లు, స్పెక్యులేషన్లలో కూడా పెట్టుబడులు పెట్టి లబ్ది పొందే అవకాశం ఉంది.

3 / 6
సింహం: వ్యాపార కారకుడైన బుధుడు ఈ రాశికి ధన, లాభాధిపతి అయినందువల్ల, ప్రస్తుతం అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. పట్టుదల, దూరదృష్టితో పాటు ఆర్థిక లావాదేవీల్లో ఆరితేరిన వారయినందువల్ల వ్యాపారపరంగా ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఈ రాశివారు రెండు వ్యాపారాలు చేపట్టే అవకాశం కూడా ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల వల్ల కూడా వీరు బాగా లాభాలు గడిస్తారు.

4 / 6
కన్య: ఈ రాశివారికి బుధుడు రాశ్యధిపతి అయినందువల్ల వీరిలో వ్యాపార కాంక్ష ఎక్కువగా ఉంటుంది. ఒక పక్క ఉద్యోగం చేస్తూనే మరో పక్క వ్యాపారాలు చేయడం, మదుపులు, పెట్టుబడులు పెట్ట డంలో ఈ రాశివారు సిద్ధహస్తులు. ఈ రాశివారు వ్యాపారపరంగా ఎటువంటి ప్రయత్నం చేపట్టినా ఇబ్బడిముబ్బడిగా కలిసి వస్తుంది. డీలర్షిప్, బ్రోకరేజ్, రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారాల్లో వీరు బాగా రాణిస్తారు. బుధుడి కారణంగా వీరు షేర్లు, స్పెక్యులేషన్లు, ఆస్తులు, అద్దెల వల్ల లాభాలు పొందుతారు.

5 / 6
తుల: వ్యాపార తత్వం అధికంగా కలిగి ఉండే ఈ రాశివారికి ఈ ఏడాదంతా వ్యాపారపరంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. లాభాలు పెరగడం, నష్టాలు దాదాపు పూర్తిగా తగ్గడం జరుగుతుంది. వ్యాపారపరంగా వీరు ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. దూరదృష్టి, అవకాశాలు అందిపుచ్చుకోవడంలో సిద్ధహస్తులైన ఈ రాశివారు అదనపు ఆదాయ మార్గాలు, షేర్లు, స్పెక్యులేషన్లు, మదుపులు, పెట్టుబడులతో సహా ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందుతారు.

6 / 6
ధనుస్సు: ఈ రాశివారికి వ్యాపార కారకుడు బుధుడు భాగ్య, దశమ స్థానాల్లో అనుకూలంగా ఉన్నందువల్ల వీరు తప్పకుండా వ్యాపార రంగంలో ప్రవేశించే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో వీరికి ఈ ఏడాది బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు తదితర పెట్టుబడి వ్యాపారాల్లో వీరు అత్యధికంగా లాభాలు గడించడం జరుగుతుంది. వ్యాపారాల రీత్యా ప్రయాణాలు చేయడానికి, విదేశాలకు వెళ్లడానికి కూడా బాగా అవకాశం ఉంది.