కుంభం (ధనిష‌్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఏలిన్నాటి శని ప్రభావం ఉన్నప్పటికీ, ఇతర శుభ గ్రహాలు అనుకూలంగా సంచారం చేస్తున్నందు వల్ల నెలంతా సానుకూలంగానే గడిచిపోతుంది. ద్వితీయార్థంలో మరింతగా ప్రాధాన్యం, ప్రాభవం పెరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న సమస్యలను, కొందరు బంధువుల విమర్శలను పట్టించు కోవద్దు. ఇతరత్రా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయి, మానసికంగా ఊరట చెందుతారు. వాస్తవానికి ఈ రాశివారికి గురు, శుక్ర, బుధ, రవుల బలంగా బాగా ఉన్నందువల్ల ఈ నెలంతా ఎక్కువగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. అన్ని రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగానికి సంబంధించి అనేక అవకాశాలు అందివస్తాయి. కొత్త పరిచయాల వల్ల ప్రయోజనాలు సిద్ధిస్తాయి. బంధువులు, స్నేహితులకు ఆర్థికంగా సహాయపడతారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా తప్పకుండా చేతికి అందుతుంది. శతభిషం నక్షత్రం వారు అధికారం చేపట్టే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పిల్లల నుంచి ఆశిం చిన శుభవార్తలు అందుతాయి. ప్రేమ వ్యవహారాల్లో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది.