
ఆరాధన: పౌర్ణమి రోజున భక్తులు విష్ణువును పూజిస్తారు. తరచుగా సత్యనారయణ వ్రత పూజ చేస్తారు. దీనివల్ల ఇంట్లో సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే అమావాస్య ప్రధానంగా పూర్వీకులను గౌరవించే రోజు (పితృ పక్షం). హిందువులు తమ పూర్వీకులను శాంతింపజేయడానికి శ్రద్ధ (ఆహార నైవేద్యాలు), తర్పణం చేస్తారు.

ధ్యానం, ప్రార్థన: పౌర్ణమి ధ్యానం, ప్రార్థన ఆధ్యాత్మిక చింతనకు అనువైన సమయంగా పరిగణించబడుతుంది. అమావాస్యను ఆత్మపరిశీలన, ధ్యానం, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోరుకునే సమయంగా భావిస్తారు.

ఆచారాలు: కొందరు పౌర్ణమికి పవిత్ర స్నానాలు (గంగా స్నానాలు వంటివి) కూడా ఆచరించవచ్చు లేదా చంద్రుడికి ప్రార్థనలు చేయవచ్చు. అలాగే అమావాస్య రోజున కూడా గంగా స్నానం చేయడం మంచిదనే చెబుతున్నారు పండితులు.

దానధర్మాలు, సత్కార్యాలు: అమావాస్య నాడు దానధర్మాలు, పేదలకు ఆహారం పెట్టడం, దేవాలయాలకు విరాళం ఇవ్వడం శుభప్రదంగా చెబుతారు. అలాగే పౌర్ణమి రోజున ఎలాంటి చెయ్యడం సత్ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు.

శక్తి: పౌర్ణమి విస్తారమైన, స్త్రీ శక్తితో ముడిపడి ఉంది. ఈరోజున అమ్మవారిని పూజించడం కూడా శుభప్రదం. అయితే అమావాస్య అంతర్ముఖ, భూమి శక్తితో ముడిపడి ఉంది. ఈరోజున ఎప్పుడు దైవ స్పరణలో ఉంటూ ధ్యానం చేయడం మంచిది.