చోటి దీపావళి రోజున ఉదయాన్నే లేవాలి. నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేసి స్నానం చేయాలి. ఆ తరువాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.
చోటి దీపావళి నాడు మీ ఇంట్లో దీపారాధన చేయాలి. సుఖ సంతోషాల కోసం లక్ష్మీ దేవిని, కుబేరుడిని పూజించాలి.
ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత శ్రీకృష్ణుడిని, ధన్వంతరిని, యముడిని పూజిస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
చోటి దీపావళి మధ్యాహ్నం హనుమంతుడిని పూజిస్తే మంచి జరుగుతుంది. ఆలయానికి వెళ్లి హనుమంతుడికి బెల్లం, పప్పు నైవేధ్యంగా అర్పించాలి.
చోటి దీపావళి రోజున కాళికా మాతను ప్రత్యేకంగా పూజిస్తారు. ఇలా చేయడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయని ప్రజల విశ్వాసం.