Dig Bala Yoga: ఆరు రాశులకు ‘దిగ్బల’ యోగం! ఉద్యోగంలో వారికి శీఘ్ర వృద్ధి పక్కా..

| Edited By: Janardhan Veluru

Oct 05, 2023 | 4:32 PM

Zodiac Signs in Telugu: గురు, బుధ గ్రహాలకు లగ్నంలో, చంద్ర, శుక్రులకు నాలుగవ స్థానంలో, శనీశ్వరుడికి సప్తమ స్థానంలో, రవి, కుజులకు దశమ స్థానంలో ఉన్నప్పుడు ఈ విధమైన దిగ్బలం పట్టి, తప్పకుండా శుభ ఫలితాలను ఇస్తాయి. ఇది జాతక చక్రంలోనే కాదు, గ్రహచారంలో కూడా వర్తిస్తుంది. గ్రహచారంలో రాశిని బట్టి చూసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రహ చారం ప్రకారం, ఆరు రాశులకు ఈ విధమైన దిగ్బల యోగం పట్టింది.

1 / 7
జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాల కారణంగా జాతక చక్రంలో దిగ్బలం ఏర్పడుతుంది. దిగ్బలం అంటే ఆ గ్రహానికి విపరీతమైన బలం పడుతుంది. ఇది శుభ యోగం మాత్రమే కలగజేస్తుంది. దీని ప్రకారం, గురు, బుధ గ్రహాలకు లగ్నంలో, చంద్ర, శుక్రులకు నాలుగవ స్థానంలో, శనీశ్వరుడికి సప్తమ స్థానంలో, రవి, కుజులకు దశమ స్థానంలో ఉన్నప్పుడు ఈ విధమైన దిగ్బలం పట్టి, తప్పకుండా శుభ ఫలితాలను ఇస్తాయి. ఇది జాతక చక్రంలోనే కాదు, గ్రహచారంలో కూడా వర్తిస్తుంది. గ్రహచారంలో రాశిని బట్టి చూసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రహ చారం ప్రకారం, ఆరు రాశులకు ఈ విధమైన దిగ్బల యోగం పట్టింది. అవి: మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, మకర రాశులు.

2 / 7
మేషం: మేష రాశివారికి గురువు కారణంగా దిగ్బలం ఏర్పడింది. గురువు ప్రస్తుతం మేష రాశిలోనే సంచారం చేస్తున్నందువల్ల ఈ యోగం ఏర్పడింది. ఎవరెన్ని ఇబ్బందులు సృష్టించినా, ఆటంకాలు  కలిగించినా, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఈ రాశివారికి జరిగే నష్టమేమీ ఉండకపోగా, వీటి వల్ల ప్రయోజనాలే చేకూరుతాయి. సాధారణంగా కష్టనష్టాలు దరి చేరవు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఎక్కడి వెళ్లినా గౌరవమర్యాదలు లభిస్తాయి. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. ఎక్కువగా శుభ వార్తలు వినడం జరుగుతుంది.

3 / 7
వృషభం: నాలుగవ స్థానంలో ఉన్న శుక్రుడి కారణంగా ఈ రాశికి దిగ్బలం పట్టింది. గృహ, వాహన యోగా లకు బాగా అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించిన ప్రణాళికలు కార్యరూపంలోకి వస్తాయి. ఇంటిని అందంగా, సుందరంగా తీర్చిదిద్దుకోవడం జరుగుతుంది, కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తి విలువ పెరుగు తుంది. తల్లి ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. తల్లి నుంచి ఆశించిన సహాయ సహకారాలు ఉంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

4 / 7
సింహం: ఈ రాశికి సప్తమ రాశిలో శనీశ్వరుడి సంచారం వల్ల దిగ్బలం ఏర్పడింది. శనీశ్వరుడికి దిగ్బలం పట్టే పక్షంలో ఏ వృత్తికి చెందినవారైనా, ఏ ఉద్యోగం చేస్తున్నా తప్పకుండా పురోగతి ఉంటుంది. ఈ పురోగతి స్థిరంగా ముందుకు వెడుతూ ఉంటుంది. రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడడం, రాజకీ యాధికారం చేపట్టడం లేదా రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెంపొందడం వంటివి తప్ప కుండా చోటు చేసుకుంటాయి. ఊహించని విధంగా జనాకర్షణ పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారో గ్యాల నుంచి కూడా కోలుకోవడం జరుగుతుంది.

5 / 7
కన్య: ఈ రాశివారికి ఈ రాశిలో సంచరిస్తున్న బుధుడి కారణంగా దిగ్బలం ఏర్పడింది. అందులోనూ బుధుడు ఉచ్ఛ పట్టడం వల్ల ఈ దిగ్బలానికి కూడా మరింత బలం పెరిగింది. దీనివల్ల సామాజి కంగానే కాకుండా వృత్తి, ఉద్యోగాల్లో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వీరి మాటకు తిరు గుండదు. ప్రముఖులతో సమాన స్థాయి ఏర్పడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కోలుకోవడం జరుగుతుంది. ఏ రంగానికి చెందినవారైనా మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది. వీరి ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి.

6 / 7
ధనుస్సు: ఈ రాశివారికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల దిగ్బలం ఏర్పడింది. దిగ్బలం పట్టిన రవి ఈ రాశివారిని వృత్తి, ఉద్యోగాలలో తప్పకుండా ఉన్నత స్థాయిలో నిలబెడతాడని చెప్పవచ్చు. ఏ రంగంలోని వారికైనా అధికార యోగం పట్టే అవకాశం ఉంటుంది. రాజకీయాలు, ప్రభుత్వం, పాలన రంగాలకు చెందినవారికి తిరుగుండదు. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు బాగా పెరుగుతాయి. సర్వత్రా ప్రాధాన్యం, ప్రాభవం ఇనుమడిస్తాయి. తండ్రి వైపు నుంచి వారసత్వపు ఆస్తి కలిసి వస్తుంది. తండ్రికి మంచి అదృష్టయోగం పడుతుంది.

7 / 7
మకరం: ఈ రాశివారికి దశమ స్థానంలో ప్రవేశించిన కుజ గ్రహం కారణంగా దిగ్బలం ఏర్పడింది. ఏ రంగంలో ఉన్నవారికైనా నాయకత్వ యోగం లేదా అధికార యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులతో అధికారాన్ని, బాధ్యతలను పంచుకోవడం జరుగుతుంది. చొరవ, దూకుడుతనం వంటివి పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు ఆశించిన స్థాయిలో స్థిరత్వం లభిస్తుంది. శీఘ్రంగా ఎదుగుదల కూడా ఉంటుంది. ఊహించని విధంగా మంచి ఆఫర్లు అందివస్తాయి.