December 2024 Horoscope: వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే.. 12 రాశుల వారికి డిసెంబర్ మాసఫలాలు

| Edited By: Janardhan Veluru

Nov 30, 2024 | 5:44 PM

మాస ఫలాలు (డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31, 2024 వరకు): మేష రాశి వారికి శుభ గ్రహాల అనుకూలతతో ఈ నెలంతా సుఖసంతోషాలతో, సానుకూలతలు, సాఫల్యాలతో సాగిపోతుంది. వృషభ రాశి వారికి ఈ నెలంతా శుక్రుడు భాగ్య స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు.. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి డిసెంబర్ మాసఫలాలు ఎలా ఉన్నాయంటే..

1 / 12
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ నెలంతా సుఖసంతోషాలతో, సానుకూలతలు, సాఫల్యాలతో సాగిపోతుంది. సాధారణంగా శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. ముఖ్యంగా రాశ్యధిపతి కుజుడు చతుర్థంలో అనుకూల సంచారం చేస్తున్నందువల్ల మానసిక ప్రశాంతత, సంతృప్తికర జీవితం ఏర్పడుతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అను కున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సానుకూ లంగా చక్కబడతాయి. కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఆరోగ్యానికి లోటు ఉండదు. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశీ ప్రయాణాలు, పర్యటనలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలకు కూడా సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. తరచూ నరసింహ స్వామి స్తోత్రం పఠించడం మంచిది.

2 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు ఈ నెలంతా భాగ్య స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. అనేక విషయాల్లో అనుకూలతలు కలుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయ త్నాల్లో శుభ వార్తలు వినడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అనుసరిస్తారు. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. సమయం అనుకూలంగా ఉన్నందువల్ల వీలైనన్ని వ్యవహారాలను చక్కబెట్టుకోవడం మంచిది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభ సమాచారం అందుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. కుటుంబపరంగా ఊహించని శుభవార్తలు వింటారు. ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం అయి, మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల్లో కొందరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా కొనసాగుతాయి. తరచూ సుందరకాండ పారాయణం చేయడం మంచిది.

3 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశ్యధిపతి బుధుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల, ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత పదవులు చేపట్టే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మనసులోని కోరికల్లో కొన్ని తప్పకుండా నెర వేరుతాయి. చాలా కాలంగా ఒత్తిడి కలిగిస్తున్న ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా అంచనాకు మించిన పురోగతి ఉంటుంది. ఇతరులకు సహాయపడగల స్థితిలో ఉంటారు. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తవు తాయి. కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రముఖులతో సత్సంబం ధాలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆర్థికంగా నిలకడగా సాగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో చాలావరకు ముందడుగు వేస్తారు. పిల్లల చదువుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆదిత్య హృదయం చదువుకోవడం ఈ రాశివారికి అత్యవసరంగా కనిపిస్తోంది.

4 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఈ రాశివారికి ఈ నెలంతా రాశ్యధిపతి చంద్రుడు అనుకూలంగా ఉండడంతో పాటు, శుభ గ్రహాల ఆశీస్సులు ఉన్నందువల్ల ధనాదాయానికి లోటుండదు. ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. విదేశీయానానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు  విదేశాల నుంచి అవకాశాలు లభిస్తాయి. పిల్లలు చదువుల్లో బాగా వృద్ధిలోకి వస్తారు. ప్రముఖు లతో పరిచయాలు బాగా విస్తరిస్తాయి. ఆర్థిక సంబంధమైన సమస్యలు, ఒత్తిళ్లు ఇతర  ఒడిదుడు కులు చాలావరకు తగ్గిపోతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి సమయం బాగా అను కూలంగా ఉంది. తల్లితండ్రుల నుంచి ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు లభిస్తాయి. తీర్థ యాత్రలు, విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలో ఆశించిన శుభవార్తలు వింటారు. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దా నాలు చేయడం, హామీలు ఇవ్వడం పెట్టుకోవద్దు. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు. ఆస్తి సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహా రాలు సాదా సీదాగా సాగిపోతాయి. ఈ రాశివారు కాలభైరవాష్టకం చదువుకోవడం చాలా మంచిది.

5 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): చతుర్థ స్థానంలో రాశ్యధిపతి రవి, ధన స్థానాధిపతి బుధుడు కలిసి ఉన్నందువల్ల కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ ప్రయత్నాలను ఎంత ఎక్కువగాచేస్తే అంత మంచిది. ఆర్థికంగా స్థిరత్వం లభించడానికి అవకాశం ఉంది. ధన స్థానంలో సంచరిస్తున్న కేతువు కారణంగా అనుకోకుండా ఖర్చులు పెర గడం, కుటుంబ సౌఖ్యం తగ్గడం వంటివి జరుగుతాయి. పిల్లలు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. కొందరు బంధుమిత్రులు ఆర్థికంగా నష్టం కలిగించే అవకాశం ఉంది. అనుకున్న పనులు కొద్దిగా నిదానంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది. వ్యాపా రాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగి పోతాయి. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి .సొంత పనుల మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. బంధుమిత్రుల సహాయ సహ కారాలు ఉంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. తరచూ శివార్చన చేయడం మంచిది.

6 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త,  చిత్త 1,2): రాశ్యధిపతి బుధుడి మీద గురు దృష్టి పడినందువల్ల చాలా వ్యవహారాలు సానుకూలంగా సాగి పోతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. మానసిక ఒత్తిడి దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ సునాయాసంగా  నెరవేరుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఆరోగ్యం బాగా మెరుగ్గా, అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది.  ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే పక్షంలో ఇబ్బందులు పడడం జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కొద్ది ప్రయత్నంతో ఉద్యోగ వాతావరణం మరింత సానుకూలంగా సాగిపో తుంది. ఆర్థిక సమస్యలు కూడా తగ్గు ముఖం పట్టే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల విషయంలో శుభ వార్తలు వింటారు.  వివాహ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అవసరం. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి ఇబ్బందులకు అవకాశం ఉంది. ఎదురు చూస్తున్న శుభ వార్తలు వింటారు. విష్ణు సహస్ర నామస్తోత్రం పఠించడం మంచిది.

7 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రాశ్యధిపతి శుక్రుడితో పాటు రవి, బుధ, శని గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవన శైలిలో మార్పు వస్తుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులకు అవకాశం ఉంది. పని భారం, అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. సాధా రణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు అందుతాయి. ఆర్థిక్ వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. ఆదాయం బాగా పెరిగే సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయి ఊరట కలుగుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.  ఉన్నత వర్గాలతో సత్సంబంధాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరు గుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. ప్రతిభకు, సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ నెల ద్వితీయా ర్థంలో అంచనాలకు మించి సంపద కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఖర్చులు పెరుగుతాయి. దుర్గాస్తోత్ర పఠనం వల్ల విజయాలు కలుగుతాయి.

8 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఈ రాశివారికి ప్రస్తుతానికి గురువు, రవి, బుధులు బాగాఅనుకూలంగా ఉన్నందు వల్ల ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. పలుకుబడి బాగా పెరు గుతుంది. కొందరు బంధుమిత్రులకు అండగా నిలబడతారు.  ధన కారకుడైన గురు గ్రహం సప్తమ స్థానంలో ఉన్నందువల్ల ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. అధికారులు, సహోద్యోగుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. బంధుమిత్రులతో మరింతగా సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ సమస్యల నుంచి ఆశించిన స్థాయిలో బయటపడడం జరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పు సహనాలతో వ్యవహరిం చాల్సిన అవసరం ఉంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం నిల కడగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శి స్తారు. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం అవసరం. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. తరచూ సుబ్ర హ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.

9 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ప్రస్తుతం గురు, శని గ్రహాలతో పాటు శుక్రుడు కూడా పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందు వల్ల, వృత్తి, ఉద్యోగంలోనే కాకుండా సామాజికంగా కూడా ప్రాభవం బాగా పెరుగుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందడంతో పాటు మొండి బాకీలు, బకాయీలన్నీ వసూలు అవుతాయి. వ్యాపా రాలు కూడా ఆశించిన దాని కంటే ఎక్కువగా లాభాలనిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన దానికంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల బాగా లాభముంటుంది. శుభ కార్యాలకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తారు.ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెంచడం మంచిది. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. కొందరు మిత్రులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్త అందుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కొద్ది రోజుల పాటు గణపతిని ప్రార్థించడం మంచిది.

10 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): శుక్ర, శనుల అనుకూలత వల్ల నెలంతా బాగా అనుకూలంగా సాగిపోయే అవకాశం ఉంది. ఉద్యో గంలో హోదాతో పాటు, జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా బిజీ అయిపోతాయి. వృత్తి, ఉద్యోగాలలో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకోవడం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. వ్యక్తిగతంగా కొన్ని కష్టనష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మంచి పరిచయాలతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఇదివరకటి కంటే ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగం మార డానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన విధంగా ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేయడం వల్ల మానసిక ఊరటతో పాటు ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఈ రాశివారు తరచూ శివార్చన చేయించడం చాలా మంచిది.

11 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశివారికి ఈ నెల ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలావరకు విజయవంతంగా  సాగిపో తుంది. చతుర్థంలో గురువు, ఉద్యోగ స్థానంలో రవి, బుధుల ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగి పోతుంది. హోదా పెరిగే అవకాశం ఉంది. అధికారుల నుంచి పోత్సాహం, ఆదరణ లభిస్తాయి. ఆరవ స్థానంలో ఉన్న కుజుడి వల్ల ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో, లావాదేవీల్లో బాగా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యో గాలపరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కొత్త ఉద్యోగాల విషయంలో శుభ వార్తలు వింటారు. నిరు ద్యోగులు ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంది. మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురు తుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. అష్టమ స్థానంలో కేతు సంచారం వల్ల ఆర్థి కంగా కొద్దిగా మోసపోయే సూచనలున్నాయి.  పిల్లల చదువుల విషయంలో ఆశించిన సమా చారం అందుతుంది.  సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం మంచిది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. శివార్చన వల్ల లాభం ఉంటుంది.

12 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృద్ధి స్థానంలో రాశ్యధిపతి గురువు, లాభ స్థానంలో శుక్రుడు ఉన్నందువల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. ఏలిన్నాటి శని ప్రభావం చాలావరకు తగ్గే అవకాశం ఉంది. కొన్ని దీర్ఘకాలిక వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం ఏర్పడుతుంది. వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం అన్యోన్యంగా, సామ రస్యంగా ముందుకు సాగిపోతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇష్టమైన వారిని కలుసుకోవడం, ఇష్టమైన ప్రాంతా లను సందర్శించడం జరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. కొందరు మిత్రులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. దత్తాత్రేయ స్తోత్ర పఠనం వల్ల మేలు జరుగుతుంది.