
ఆచార్య చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన గొప్ప పండితుడు, ఆధ్యాత్మికగురువు. ఈయన తన అనుభవాల ఆధారంగా నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, ఎన్నో విషయాలను తెలియజేశారు. బంధాలు, బంధుత్వాలు, మనీ, విద్య, స్త్రీ,పురుషులు, సక్సెస్, ఓటమి ఇలా చాలా విషయాల గురించి వివరంగా తెలియజేశారు. ఇవి నేటి తరం వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

అయితే చాణక్యుడు జాబ్ విషయంలో కూడా ఎన్నో విషయాల గురించి తెలియజేయడం జరిగింది. ప్రస్తుత రోజుల్లో జాబ్ మానెయ్యడం అనేది సాధ్యమైన పని కాదు. కొన్నిసార్లు ఇది ఆర్థికసమస్యలను, ఒత్తిడిని పెంచుతుంది. అందుకే జాబ్ మానేసే విషయంలో తప్పకుండా కొన్ని నియమనిబంధనలు పాంటించాలని చెబుతున్నాడు. అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

చాణక్యడు జాబ్ మానేసే విషయంలోచాలా ముఖ్య విషయాలు తెలిపారు. జీవితంలో ఏ నిర్ణయం అయినా సరే ఎక్కువగా ఆలోచించి తీసుకోవాలి, ముఖ్యంగా కెరీర్‌కు సంబంధించి అని తెలిపారు. జాబ్ మానేసేవారు కొన్ని సందర్భాల్లో మాత్రమే మానెయ్యడంలో తప్పు లేదు. అది ఎప్పుడంటే? ఉద్యోగం చేసే చోట ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు , అక్కడ జాబ్ చేయడం కంటే త్యాగం చేయడం మంచిది. మీకు మీ ఆఫీసులో సరైన గుర్తింపు లభించకపోతే, ముఖ్యంగా పనికి తగిన గుర్తింపు లేకపోతే జాబ్ మానెయ్యడంలో తప్పులేదని తెలిపారు.

మీ సామర్థ్యాలను, మీ కృషికి గౌరవం లేకపోయినా, మీ అభివృద్ధి ఆగిపోతుందని మీకు అనిపించినప్పుడు మీరు ఆచోట ఉండకూడని చెబుతున్నాడు చాణక్యుడు. అలాగే మీకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, ఉద్యోగంలో విచక్షణ, మీ నిర్ణయానికి సరైన గుర్తింపు, మానసిక పరమైన వృత్తి వంటి చోట పని చేయడం కంటే వదిలేయడమే ఉత్తమం అంటున్నాడు చాణక్యుడు.

అలాగే ఆ చార్య చాణక్యుడు ఉద్యోగం మానెయ్యడం గురించి చెబుతూ.. డబ్బే జీవితానికి ఆధారం, మీ జీతం మీ ప్రాథమిక అవసరాలు తీర్చకపోయినా, మీ కార్యాలయాల్లో మంచి వాతావరణం లేదు అని మీకు అనిపించినా ఆ ఉద్యోగం చేసినా వృదే అంటున్నాడు. అలాగే జాబ్ వదిలేసే ముందు, ఆర్థిక పరిస్థితి, మరో కొత్త ఉద్యోగం, మీ స్కిల్స్ వీటన్నింటిని కూడా ఒకసారి పున:పరిశీలించుకోవాలంట.