
వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల జీవితం మాత్రమే కాదు, రెండు కుటుంబాల కలయిక అంటున్నాడు చాణక్యుడు. అందువలన వివాహం చేసుకునే అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ తమ భాగస్వామి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంట, ముఖ్యంగా కొన్ని లక్షణాలు మీ భాగస్వామిలో ఉంటే, ఆ సంబంధాన్ని రిజక్ట్ చేసినా తప్పే లేదంట. కాగా, దాని గురించే ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.

భాగస్వామి స్వభావం : చాణక్యనీతి ప్రకారం వివాహం చేసుకోవడానికి ముందు తప్పకుండా భాగస్వామి స్వభావం తెలుసుకోవాలి అంట. కోపిష్టి, అర్థం చేసుకునే మనసు ఉందా లేదా? ఇలా ప్రతీది తెలుసుకోవాలంట. ప్రతి మాటకు వాదిచే అలవాటు ఉండటం, ప్రతి చిన్నదానికి కోపం తెచ్చుకోవడం లాంటిది చేసే అలవాటు ఉంటే, అలాంటి సంబంధం వదిలేసినా తప్పులేదు అని చెబుతున్నాడు చాణక్యుడు.

భాగస్వామి అలవాట్లు, ప్రవర్తన : వివాహానికి ముందు భాగస్వామి అలవాట్లు, ప్రవర్తన గురించి కూడా తెలుసుకోవాలి అంట. చిన్న చిన్న అలవాట్లు పెద్ద ప్రమాదానికి దారితీస్తాయంట. మీ భాగస్వామి పదే పదే అబద్ధాలు చెబుతున్నాడా, అనసవరంగా డబ్బు ఖర్చు చేయడం, వాగ్దానాలు నిలబెట్టుకోవడంలో విఫలం అవ్వడం, విపరీతంగా మనీ ఖర్చు చేయడం, పెద్దల పట్ల గౌరవం లేకపోవడం వంటి అలావాట్లు ఉంటే, అలాంటి వ్యక్తితో వివాహం నరకంతో సమానం అంటున్నాడు చాణక్యుడు.

కుటుంబం : మీరు వివాహం చేసుకోబోయే వ్యక్తి కుటుంబం మీపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకోసమే మీరు వివాహం చేసుకునే కుటుంబం విలువలను, వారి ప్రవర్తన వీటన్నింటిని కూడా గమనించాలని, మంచి విలువలు, మంచి బంధుత్వం పెంచుకునే వారితో సంబంధం కుదుర్చుకోవడం చాలా మంచిది అని చెబుతున్నాడు చాణక్యుడు.

(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)