


ఫైనాన్షియల్ ప్లానింగ్‌పై నిర్లక్ష్యం: ఆర్థిక ప్రణాళిక, స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించడంలోని ప్రాముఖ్యతపై చాణక్యుడు మాట్లాడాడు. పర్సనల్ ఫైనాన్స్‌ను ప్లాన్ చేయడంలో, పర్యవేక్షించడంలో వైఫల్యం.. వ్యర్థ ఖర్చులకు, ఆర్థిక అస్థిరతకు దారి తీస్తుంది.

నమ్మకం: ఆచార్య చాణక్య ప్రకారం భర్తభర్తల మధ్య వివాహ బంధానికి బలమైన పునాది నమ్మకం. మీ భాగస్వామికి నమ్మకం కలిగించడానికి మీ వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. దీనితో పాటు మీ చర్యలతో సమగ్రతను ప్రదర్శిస్తూ తద్వారా నమ్మకాన్ని కాపాడుకోండి. మీ జీవిత భాగస్వామికి నమ్మక ద్రోహం కలలో కూడా తలపడవద్దు. నమ్మకం లేని సంబంధం బలహీనంగా మారవచ్చు.

అస్థిర ఆలోచనలు: స్నేహితులు లేదా కొన్ని గుంపుల మధ్య అసమ్మతిని కలిగించే, లేదా వారిని విడదీసే ప్రవర్తన కలిగిన వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. బంధాలను విడదీసేందుకు అసమ్మతి బీజాలు నాటి.. అనవసర వివాదాలు సృష్టించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చాణక్యుడు సూచిస్తున్నాడు.